South Central Railway: ప్రయాణికులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో ఆరు ప్రత్యేక రైళ్లు రద్దు.. మరో 4 అందుబాటులోకి.. వివరాలివే..
South Central Railway: ప్రయాణికులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో ఆరు ప్రత్యేక రైళ్లు రద్దు.. మరో 4 అందుబాటులోకి.. వివరాలివే..
South Central Railway: రైల్వే అధికారులు రద్దీ తక్కువగా ఉండే రూట్లల్లో 6 ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా మరో 4 రైళ్లను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే..
రద్దీ తక్కువగా ఉన్న రూట్లతో నడుపుతున్న రైళ్లను రద్దు చేస్తున్న దక్షిణ మధ్య రైల్వే.. తాజాగా మరో ఆరు రైళ్లను రద్దు చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. రద్దు చేసిన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి..
2/ 13
1. విశాఖఫట్నం-కాచిగూడ ట్రైన్ జులై 1 నుంచి 14 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 13
2. కాచిగూడ-విశాఖపట్నం ట్రైన్ జులై 2 నుచి 15 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 13
3. విశాఖపట్నం-కడప రైలు జులై 1 నుంచి 14 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 13
4. కడప-విశాఖపట్నం రైలు జులై 2 నుంచి 15 వరకు రద్దు చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 13
5. విశాఖపట్నం-లింగంపల్లి రైలును జులై 1 నుంచి 14 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 13
6. లింగంపల్లి-విశాఖపట్నం రైలును జులై 2 నుంచి 15 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే మరికొన్ని రూట్లలో ప్రత్యేక రైళ్లను నడుపుతామని ప్రకటించింది.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 13
ప్రయాణికుల అవసరాల మేరకు మరో 4 రైళ్లను అందుబాటులోకి తెచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 13
అవి.. జూలై 9 నుంచి బెంగళూరు కంటోన్మెంట్ నుంచి అగర్తల వరకు వెల్లే రైలును ఈ నెల 27 వరకు ప్రతీ శుక్రవారం నడవనుందని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
10/ 13
అగర్తల-బెంగళూరు కంటోన్మెంట్ రైలు జులై 6 నుంచి 24 వరకు ప్రతీ మంగళవారం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
11/ 13
అంతే కాకుండా అగర్తల-సికింద్రాబాద్ రూట్ లో జులై 9, 16న ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
12/ 13
సికింద్రాబాద్- అగర్తల రూట్ లో జులై 5, 12న ప్రత్యేక రైలు నడవనుందని అధికారులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)