RAILWAY OFFICIALS HAVE RESTORED SEVERAL TRAINS IN THE WAKE OF THE LOCKDOWN EASING HERE THE FULL DETAILS VB
Trains Started : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. పట్టాలెక్కిన ప్యాసింజర్ రైళ్లు.. త్వరలో సమ్మర్ స్పెషల్ రైళ్లు కూడా..
Trains Started : దేశంలో లాక్ డౌన్ నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య తీవ్రంగా తగ్గిపోయింది. దీంతో రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం కొంత కేసులు తగ్గుముఖం పడుతుండడంతో పాటు ఆంక్షలు సడలిస్తున్న నేపథ్యంలో రైల్వేశాఖ మళ్లీ రైళ్లను పునరుద్ధరించాలని నిర్ణయించింది. పూర్తి వివరాలివే.
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండటంతో పలు రాష్ట్రాలు లాక్డౌన్ను విధించిన విషయం తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 10
వాటి ప్రభావం రైల్వేలపై తీవ్రంగా పడింది. దీంతో ప్రయాణికుల తాకిడి పూర్తిగా తగ్గిపోయింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 10
దీంతో రాజధాని, దురంతో, శతాబ్ది తదితర సూపర్ ఫాస్ట్, ఎక్స్ప్రెస్ రైళ్లతో పాటు ప్యాసింజర్ రైళ్లు కూడా రద్దయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 10
ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. పలు రాష్ట్రాలు ఆంక్షలను సడలిస్తున్నందున రైల్వేశాఖ మళ్లీ రైళ్లను పునరుద్ధరించాలని నిర్ణయించింది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 10
దీనిలో భాగంగానే .. ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలో 24 రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం
6/ 10
రద్దు కాకముందు ఎటువంటి చార్జీలు ఉన్నాయో ప్రస్తుతం అవే ఉంటాయని రైళ్లు నడిచే సమయం, స్టాప్స్, మార్గాలతో పాటు చార్జీల్లో ఎలాంటి మార్పులు ఉండవని అధికారులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 10
అంతే కాకుండా వేసవి కాలంలో నడిచే సమ్మర్ స్పెషల్ రైళ్లను కూడా నడపాలని నిర్ణయించినట్లు తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 10
ఉత్తరప్రదేశ్, బిహార్ ప్రజల సౌలభ్యం దృష్ట్యా ఢిల్లీ – గోరఖ్పూర్, ఛప్రా – పన్వెల్, గోరఖ్పూర్-పన్వెల్, మధ్య స్పెషల్ సమ్మర్ ట్రైన్లను ప్రారంభించనున్నట్లు ట్విట్టర్ ద్వారా కేంద్ర రైల్వేశాఖ మంత్రి పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)