రాధికా మర్చంట్ ఈరోజు ది గ్రాండ్ థియేటర్, జియో వరల్డ్ సెంటర్లో తన భరతనాట్య ఆరంగేట్రం చేస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ దిగ్గజ తారలు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ తదితరులు హాజరుకానుండడం విశేషం. ఇంకా.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే సైతం ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. నీతా, ముఖేష్ అంబానీ ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేయనున్నారు.
రాధిక మర్చంట్ శ్రీ నిభా ఆర్ట్స్‌కి చెందిన భావనా థాకర్ శిష్యురాలు. శ్రీమతి భావనా థాకర్ భారతీయ ప్రపంచానికి వెలకట్టలేని సహకారం అందించారు. నాలుగు దశాబ్దాల పాటు ఆమో శాస్త్రీయ నృత్య ప్రస్థానం సాగింది. ఆమె ముంబై యూనివర్శిటీకి చెందిన నలంద ఇన్స్టిట్యూట్ నుంచి మాస్టర్స్ డిగ్రీని పొందారు. శ్రీ నిభా ఆర్ట్స్ పేరుతో ఆమె అనేక సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు.
దివ్యాంగుల కోసం అనేక కార్యక్రమాలను నిర్వహించారు. ఇంకా వారికి శిక్షణ అందించారు. దీనిని బట్టి ఆమె నిబద్ధత మరియు అంకితభావం గురించి చెప్పవచ్చు. రాధిక మర్చంట్ కూడా దేశంలోని ప్రసిద్ధ వ్యాపార కుటుంబం నుండి వచ్చింది. రాధిక మర్చంట్ యొక్క ఇన్విటేషన్ కార్డ్ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాధిక మర్చంట్ డిసెంబర్ 18, 1994న జన్మించారు.
రాధిక ఎన్కోర్ హెల్త్‌కేర్ యొక్క CEO అయిన వీరేన్ మర్చంట్ మరియు శైలా మర్చంట్ల కుమార్తె. మర్చంట్ తన ప్రాథమిక విద్యను ముంబైలోని కేథడ్రల్ మరియు జాన్ కానన్ పాఠశాలలు మరియు ఎకోల్ మోంటియల్ వరల్డ్ స్కూల్లో పూర్తి చేశారు. ఆమె న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుంచి పాలిటిక్స్, ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని కూడా పొందారు. ఆమె భారతదేశానికి తిరిగి వచ్చి ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ప్రొఫెషనల్‌గా పని చేయడం ప్రారంభించారు.