పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తమ కస్టమర్లకు కీలక ప్రకటన జారీ చేసింది. కేవైసీ (KYC-know your customers) ప్రక్రియను ఆగస్టు 31లోపు పూర్తి చేసుకోవాలని, లేనిపక్షంలో అకౌంట్ (Account)ను ఫ్రీజ్ చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ట్వీట్ (Tweet) చేసింది. దీంతో ప్రతి కస్టమర్ కేవైసీ ప్రక్రియను పూర్తిచేయడం తప్పనిసరి.
* డబ్బును విత్‌డ్రా చేసుకోలేరు : ఆర్బీఐ (RBI) మార్గదర్శకాల ప్రకారం.. మార్చి 31, 2022లోపు ప్రతి కస్టమర్ కేవైసీని తప్పనిసరిగా పూర్తి చేయాలి. అయితే ఆగస్టు 31, 2022 వరకు కేవైసీ లేకుండా అకౌంట్‌ను ఉపయోగించడానికి వీలుంటుంది. ఆ తర్వాత అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. డబ్బు డ్రా చేసుకోవడానికి అవకాశం ఉండదు. కేవైసీ కంపైల్ చేసిన కస్టమర్లు మాత్రమే ఎలాంటి పరిమితులు లేకుండా బ్యాంకింగ్ సేవలను పొందనున్నారు.
* కేవైసీ స్కామ్ ట్రాప్‌లో పడకండి : చాలా మంది కస్టమర్లకు కేవైసీ కోసం కాల్స్ లేదా మెసేజ్ వస్తుంటాయి. పాన్ నంబర్, ఆధార్ వివరాలను అడగుతుంటారు. అయితే ఇలాంటి ఫేక్ కాల్స్, మెసేజ్‌ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని పీఎన్బీ సూచించింది. కాబట్టి కేవైసీ కోసం లోకల్ బ్రాంచ్‌ను సందర్శించడం బెటర్. పాన్, ఆధార్ వివరాలతో కేవైసీ ఫారమ్‌ను పూరించి ఈ ప్రక్రియను పూర్తిచేయవచ్చు.
* ఆన్లైన్ ద్వారా కేవైసీ : పత్రి కస్టమర్ ఇంట్లోనే ఉంటూ కేవైసీ ప్రక్రియ పూర్తిచేయవచ్చు. మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడీతో, మీ బ్యాంక్ అధికారిక ఇమెయిల్ అడ్రస్‌కు పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ వంటి డాక్యుమెంట్లను సెండ్ చేయవచ్చు. లేదా మీ బ్యాంక్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి KYC కోసం అవసరమైన వివరాలను అందించవచ్చు.
* శాలరీ అకౌంట్ కస్టమర్లకు గుడ్ న్యూస్ : మరోపక్క శాలరీ అకౌంట్ కస్టమర్లకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. బీమా కవరేజ్, వివిధ ఫీచర్లతో కూడిన ప్రీ-క్వాలిఫైడ్ క్రెడిట్ కార్డును ప్రారంభించింది. పీఎన్బీ వన్ మొబైల్ బ్యాంకింగ్ యాప్, వెబ్సైట్/ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీసు ద్వారా ఈ సేవలు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే రూపే, వీసా ప్లాట్ఫామ్ల్లో కూడా ఈ కార్డు సేవలు అందుబాటులో ఉంటాయని పంజాబ్ నేషనల్ బ్యాంకు వెల్లడించింది.
శాలరీ అకౌంట్ కస్టమర్లు నమోదు చేసిన బేసిక్ వివరాల ఆధారంగా అనేక ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా రివార్డు పాయింట్స్, సమగ్ర బీమా కవరేజీ, దేశీయ, అంతర్జాతీయ కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్, హెల్త్ చెకప్, కాంప్లిమెంటరీ గోల్ఫ్, స్పా, జిమ్ సెషన్స్, అధిక క్రెడిట్ లిమిట్స్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లను పొందవచ్చు.
అయితే డిజిటల్, పేపర్‌లెస్ క్రెడిట్ కార్డు అప్లికేషన్ ప్రాసెస్ ద్వారా మాత్రమే ఈ కొత్త ప్రీ-క్వాలిఫైడ్ క్రెడిట్ కార్డు సేవలు అందుబాటులో ఉంటాయని పీఎన్బీ స్పష్టం చేసింది. కాగా, ఇటీల ఈ బ్యాంకు వన్ యాప్‌లో మరో సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్ ద్వారా ఫిక్స్డ్ డిపాజిట్లపై ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయాన్ని త్వరగా పొందవచ్చు.