ఇండియన్ బ్యాంకులు డిపాజిటర్లను ఆకర్షించేందుకు స్పెషల్ స్కీమ్స్ ప్రకటిస్తున్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్లపై వరుసగా వడ్డీరేట్లను పెంచిన బ్యాంకులు ఇప్పుడు స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొత్తగా 600 రోజుల స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్‌ను ప్రవేశపెట్టింది. (ప్రతీకాత్మక చిత్రం)
60 ఏళ్లు నిండిన సీనియర్ సిటిజన్లు, 80 ఏళ్లు నిండిన సూపర్ సీనియర్ సిటిజన్లకు ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. కస్టమర్లు రూ.2 కోట్లలోపు సింగిల్ టర్మ్ డిపాజిట్‌గా దీంట్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. PNB అందిస్తున్న ఈ స్పెషల్ 600 రోజుల FD ప్రోగ్రామ్.. కాలబుల్, నాన్ కాలబుల్ ఆప్షన్లలో లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
కస్టమర్లకు హై క్లాస్ స్కీమ్స్ అందించడమే తమ లక్ష్యం అని చెప్పారు పంజాబ్ నేషనల్ బ్యాంక్ MD & CEO అతుల్ కుమార్ గోయెల్. వారికి అధిక వడ్డీ రేటును అందించడానికి స్పెషల్ స్కీమ్స్ ఆఫర్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత కస్టమర్లు PNB ONE యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా లేటెస్ట్ స్కీమ్‌ను ఆన్లైన్లో పొందవచ్చని వివరించారు. (ప్రతీకాత్మక చిత్రం)