ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ల వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకుల సరసన పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా చేరింది. కొన్ని టెన్యూర్‌ల ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచింది. పెరిగిన రేట్లు డిసెంబర్ 19 నుంచి అమల్లోకి వచ్చాయి. 666 రోజుల కాలపరిమితి ఉన్న ఎఫ్‌డీలపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రస్తుతం 7.25 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
* నూతన వడ్డీ రేట్లు
7 రోజుల నుంచి 14 రోజుల కాలపరిమితి ఎఫ్‌డీలపై సాధారణ ప్రజలకు 3.50 వడ్డీ, సీనియర్ సిటిజన్స్‌కు 4 శాతం వడ్డీని అందిస్తోంది. 15 రోజుల నుంచి 29 రోజులకు, 30 రోజుల నుంచి 45 రోజులకు సాధారణ ప్రజలకు 3.50శాతం, సీనియర్ సిటిజన్స్‌కు 4 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. 46- 90 రోజులకు, 91- 179 రోజుల ఎఫ్‌డీలపై సాధారణ ప్రజలకు 4.50 శాతం, సీనియర్ సిటిజన్స్‌కు 5 శాతం వడ్డీని అందిస్తోంది.
600 రోజుల కాలపరిమితి ఎఫ్‌డీలపై సాధారణ ప్రజలకు 7 శాతం, సీనియర్ సిటిజన్స్‌కు 7.50 శాతం ఇస్తోంది. 601 రోజుల నుంచి 665 రోజుల కాలపరిమితికి సాధారణ ప్రజలకు 6.30 శాతం, సీనియర్ సిటిజన్స్‌కు 6.80 శాతం వడ్డీని అందిస్తోంది. 666 రోజుల కాలపరిమితి ఎఫ్‌డీలపై సాధారణ ప్రజలకు 7.25 శాతం, సీనియర్ సిటిజన్స్‌కు 7.75 శాతం వడ్డీరేట్ను అమలు చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)