అంతేకాకుండా బ్యాంక్ కస్టమర్లు వారి డెబిట్ కార్డులపై లిమిట్‌ను వారే సెట్ చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్, పీఎన్బీ ఏటీఎం, ఐవీఆర్ ద్వారా కస్టమైజ్డ్ లిమిట్‌ను సెట్ చేసుకోవచ్చు. లేదంటే బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి లిమిట్ ఎంతో సెట్ చేయొచ్చు. బ్యాంక్ అందిస్తున్న గరిష్ట లిమిట్‌కు లోబడే మీరు మీకు నచ్చిన లిమిట్‌ను సెట్ చేసుకోవచ్చు. బ్యాంక్ లిమిట్‌కు మించి ఎక్కువ పరిమితిని ఏర్పాటు చేసుకోలేం. కాగా బ్యాంక్ డెబిట్ కార్డు లిమిట్ అనేది ఒక్కో ట్రాన్సాక్షన్ మీదా కూడా ఆధారపడి ఉంటుంది.