1. భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) పలు రకాల ఛార్జీలను పెంచింది. ఉచిత లావాదేవీల లిమిట్లో కూడా మార్పులు చేసింది. ఈ కొత్త రూల్స్ మే 29 నుంచి అమలులోకి వస్తాయి. దీంతో పాటు ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లింక్డ్ లెండింగ్ రేట్ 0.40 శాతం పెంచి 6.90 శాతం చేసినట్టు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. Savings Account: పంజాబ్ నేషనల్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ ట్రాన్సాక్షన్ లిమిట్‌ను పెంచింది. లిమిట్ దాటిన తర్వాత వసూలు చేసే ఛార్జీలు కూడా పెరిగాయి. గతంలో ఒక ఆర్థిక సంవత్సరంలో ఉచిత ట్రాన్సాక్షన్స్ లిమిట్ 40 ఉండగా, ఆ తర్వాత ప్రతీ లావాదేవీపై రూ.2 చొప్పున ఛార్జీ వసూలు చేసేది. ఇకపై 50 ఉచిత ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రతీ లావాదేవీపై రూ.10 చొప్పున ఛార్జీ చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4. Locker Charges: లాకర్ ఛార్జీలు ఆలస్యం చేస్తే యాన్యువల్ రెంట్లో 25 శాతం పెనాల్టీ చెల్లించాలి. ఒక ఏడాది నుంచి మూడేళ్ల వరకు జాప్యం చేస్తే యాన్యువల్ రెంట్లో 50 శాతం చెల్లించాలి. మూడేళ్ల కన్నా ఎక్కువ ఆలస్యం చేస్తే బ్యాంకు ఆ లాకర్‌ను పగలగొట్టి తెరుస్తుంది. అయితే ఐదేళ్ల లాకర్ రెంట్ ఒకేసారి చెల్లించే అవకాశం ఇస్తోంది. పలు మెట్రో శాఖలలో 25 శాతం ప్రీమియం రెంట్ ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి. ఒకవేళ లాకర్ హోల్డర్ అడ్వాన్స్‌గా అద్దె చెల్లించిన ఐదేళ్ల వ్యవధి ముగిసేలోపు లాకర్‌ను సరెండర్ చేస్తే, యాన్యువల్ కార్డ్ రేట్ ప్రకారం లాకర్ అద్దె వసూలు చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)