Bank News: ఒకటో తేదీ షాక్.. ఈ 2 బ్యాంకుల కీలక నిర్ణయం, ఈరోజు నుంచి..
Bank News: ఒకటో తేదీ షాక్.. ఈ 2 బ్యాంకుల కీలక నిర్ణయం, ఈరోజు నుంచి..
Interest Rates | బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాలి. తాజాగా రెండు బ్యాంకులు రుణ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.
Loan EMI | ప్రభుత్వ రంగానికి చెందిన రెండు బ్యాంకులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. కస్టమర్లకు ఒకటో తేదీ షాకిచ్చాయి. దీంతో ఈ రెండు బ్యాంకుల కస్టమర్లపై ప్రతికూల ప్రభావం పడనుంది. బ్యాంకులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
2/ 9
దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) తాజాగా రుణ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ల (MCLR) పెంచేశాయి.
3/ 9
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేటును 30 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఎంసీఎల్ఆర్ రేటును 15 బేసిస్ పాయింటలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
4/ 9
ఈ ఇరు బ్యాంకులు తీసుకున్న నిర్ణయం వల్ల బ్యాంకుల నుంచి లోన్ తీసుకున్న వారిపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు. కొత్తగా లోన్ తీసుకునే వారు సహా ఇప్పటికే లోన్ పొందిన వారిపై కూడా ప్రభావం ఉంటుంది.
5/ 9
కొత్తగా లోన్ తీసుకోవాలని భావించే వారు అధిక వడ్డీ రేటు చెల్లించుకోవాల్సి వస్తుంది. అలాగే ఇప్పటికే లోన్ తీసుకొని ఉంటే.. రీసెట్ డేట్ నుంచి రుణ రేట్లు పైకి చేరతాయి. దీని వల్ల నెలవారీ ఈఎంఐ కూడా పైకి కదులుతుంది.
6/ 9
కాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణ రేట్ల పెంపు నిర్ణయం నవంబర్ 1 నుంచి అమలులోకి వస్తుంది. పీఎన్బీ రేట్ల పెంపును గమనిస్తే.. ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 8.05 శాతానికి చేరింది. ఇదివరకు ఎంసీఎల్ఆర్ రేటు 7.75 శాతంగా ఉంది.
7/ 9
బ్యాంకులు సాధారణంగా ఏడాది ఎంసీఎల్ఆర్ రేటను రుణ రేట్లను నిర్ణయించడానికి ప్రామాణికంగా తీసుకుంటాయి. ఇతర ఎంసీఎల్ఆర్ రేట్లను గమనిస్తే.. ఓవర్ నైట్ నుంచి మూడేళ్ల టెన్యూర్లోని ఎంసీఎల్ఆర్ 30 బేసిస్ పాయింట్లు పెరిగింది. దీంతో ఈ రేట్లు 7.4 శాతం నుంచి 8.35 శాతం మధ్యలో ఉన్నాయి.
8/ 9
బ్యాంక్ ఆఫ్ ఇండియా విషయానికి వస్తే.. ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 7.95 శాతానికి చేరింది. నవంబర్ 1 నుంచి రేట్ల పెంపు అమలులోకి వచ్చింది. ఇదివరకు ఎంసీఎల్ఆర్ రేటు 7.8 శాతంగా ఉండేది.
9/ 9
ఇరత బ్యాంకుల ఎంసీఎల్ఆర్ రేట్లను గమనిస్తే.. 10 బేసిస్ పాయింట్ల మేర పెరిగింది. దీంతో వడ్డీ రేట్లు 7.05 శాతం నుంచి 8.1 శాతం మధ్యలో ఉంది. అందువల్ల బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలని భావించే వారు ఈ విషయాలను గుర్తించుకోవాలి. తక్కువ వడ్డీ రేటు ఉన్న బ్యాంక్లో లోన్ తీసుకోవడం ఉత్తమం.