1. అదానీ కంపెనీల షేర్ వ్యాల్యూను కృత్రిమంగా పెంచారనే ఆరోపణలతో జరుగుతున్న వివాదం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇలాంటి మరోఘటన బయటకు వచ్చింది. యూట్యూబ్ ద్వారా షేర్ పంప్ అండ్ డంప్‌కు (Pump-and-Dump Scam) పాల్పడుతున్న బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీతో పాటు మరో 45 మంది వ్యక్తులపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) కొరడా ఝళిపించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించకుండా వారిని ఒక సంవత్సరం పాటు నిషేధించింది. అసలు షేర్ పంప్ అండ్ డంప్ అంటే ఏంటి? ఈ కేసు సంబంధించిన వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం. షేర్ పంప్ అండ్ డంప్ అంటే.. చౌకగా కొనుగోలు చేసిన స్టాక్‌ను ఎక్కువ ధరకు విక్రయించడానికి, తప్పుడు ప్రకటనల ద్వారా స్టాక్ ధరను కృత్రిమంగా పెంచే ప్రయత్నాలు చేయడం. ఆపరేటర్స్ వారి అధిక విలువ షేర్లను ‘డంప్’ (సేల్) చేసిన తర్వాత, వాటి ధర పడిపోతుంది. దీంతో పెట్టుబడిదారులు తమ డబ్బును కోల్పోతారు. (ప్రతీకాత్మక చిత్రం)

4. మార్కెట్ రెగ్యులేటర్ లెక్కల ప్రకారం.. యూట్యూబ్‌లో షేర్ పంప్ అండ్ డంప్ ద్వారా బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ రూ. 29.43 లక్షలు, అతని భార్య రూ. 37.56 లక్షలు అక్రమంగా లబ్ధిపొందారు. ఈ కేసులో వీరితో పాటు ఇతర నిందితులు అక్రమంగా లబ్ధిపొందిన సొమ్మును జప్తు చేయాలని సెబీ ఆదేశించింది. గతేడాది ఏప్రిల్ 27 నుంచి సెప్టెంబర్ 30 మధ్య కాలంలో వీరు ఈ లాభాలు పొందారు. నిందితుల నుంచి జప్తు చేయాల్సిన మొత్తాన్ని 15 రోజుల్లో షెడ్యూల్డ్ బ్యాంక్‌లో డిపాజిట్ చేయాలని సెబీ ఆదేశించింది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఈ కేసులో నిందితులు కొన్ని సంస్థల ద్వారా స్టాక్ ధరలను తారుమారు చేసి స్టాక్‌లో అప్లోడ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తప్పుడు కంటెంట్‌తో కూడిన యూట్యూబ్ వీడియోలు, అదనపు రీచ్ కోసం కోట్లాది రూపాయల విలువైన పెయిడ్ మార్కెటింగ్ క్యాంపెయిన్ సపోర్ట్‌తో పెట్టుబడిదారులను ఆకర్షించారని ఫిర్యాదులు అందాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. సెబీ చట్టం-1922లోని సెక్యూరిటీల మార్కెట్‌కు సంబంధించిన (మోసపూరిత, అన్యాయమైన ట్రేడ్ పద్ధతుల నిషేధం) నిబంధనలు- 2003 కింద సెబీ విచారణను (ప్రాథమిక దర్యాప్తు) నిర్వహించింది. సాధనా బ్రాడ్‌కాస్ట్‌పై 2022 ఏప్రిల్ 27 నుంచి సెప్టెంబర్ 30 మధ్య సెబీ విచారణ జరిపింది. ఇక, షార్ప్‌లైన్ బ్రాడ్‌కాస్ట్‌పై 2022 ఏప్రిల్ 12 నుంచి ఆగస్టు 19 మధ్య విచారణ జరిపి రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
7. సెబీ తన రెండు మధ్యంతర ఉత్తర్వుల్లో ఇలా పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ కేసు నిందితులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏ విధంగానైనా సెక్యూరిటీలను కొనుగోలు చేయడం, విక్రయించడం లేదా డీల్ చేయడం నిరోధించాలని ఆదేశించింది. ఈ ఆర్డర్ల తేదీ నాటికి ఏదైనా ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ డెరివేటివ్ కాంట్రాక్ట్‌ల్లో వారు ఏదైనా ఓపెన్ పొజిషన్ కలిగి ఉంటే, ఈ ఆర్డర్ తేదీ నుంచి లేదా అటువంటి కాంట్రాక్టుల గడువు ముగిసే మూడు నెలలలోపు, ఏది ముందుగా అయితే దాన్ని ప్రకారం పొజిషన్లను స్క్వేర్ ఆఫ్ చేయవచ్చని ఉత్తర్వులో పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)