పీపీఎఫ్ స్కీమ్ ఈఈఈ కేటగిరి కిందకు వస్తుంది. అంటే మూడు రకాల పన్ను ప్రయోజనాలు పొందొచ్చు. సెక్షన్ 80సీ కింద ఇన్వెస్ట్ చేసిన డబ్బులపై ట్యాక్స్ మినహాయింపు ఉంది. దీనిపై వచ్చే వడ్డీపై ట్యాక్స్ పడదు. మెచ్యూరిటీ సమయంలో విత్‌డ్రా చేసుకునే మొత్తంపై కూడా ఎలాంటి పన్ను ఉండదు. అందుకే దీన్ని బెస్ట్ ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్‌లో ఒకటిగా చెప్పుకుంటారు.