మరోవైపు బ్యాంక్ సెప్టెంబర్ నెల ఆర్థిక ఫలితాలు కూడా అదిరిపోయాయి. నికర వడ్డీ ఆదాయం 10 శాతానికి పైగా పెరిగింది. 1769 కోట్లుగా నమోదు అయ్యింది. మునపటి ఏడాది ఇదే త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం రూ. 1597 కోట్లుగా ఉంది. కేవలం ఈ బ్యాంక్ మాత్రమే కాకుండా ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా అదరగొట్టేస్తున్నాయి. షేర్ల ధర ర్యాలీ చేస్తోంది.
ఇకపోతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వారు జాగ్రత్తగా ఉండాలి. మార్కెట్లో లాభాలతో పాటుగా భారీ నష్టాలు కూడా ఉంటాయి. ఒక షేరు ఒక టైమ్లో లాభాలు ఇచ్చిందని భ్రమపడితే.. అదే షేరుతో నష్టాలు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల మీరు డబ్బులు పెట్టడానికి ముందు ఇన్వెస్ట్మెంట్ నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం. లేదంటే ఇబ్బంది పడాల్సి రావొచ్చు. పెట్టిన డబ్బులు కూడా వెనక్కి రాకపోవచ్చు. అందుకే మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.