1. ఒకప్పుడు లోన్ తీసుకోవాలంటే పెద్ద ప్రాసెస్ ఉండేది. లోన్ కోసం అప్లికేషన్ (Loan Application) సబ్మిట్ చేయడం, బ్యాంకు సిబ్బంది డాక్యుమెంట్స్ వెరిఫై చేయడం, ఆ తర్వాత వ్యక్తిగతంగా వెరిఫికేషన్ చేయడం, ఇవన్నీ పూర్తయ్యాక లోన్ మంజూరు చేయడం లాంటి ప్రాసెస్ ఉండేది. కానీ ఇప్పుడు అంతా డిజిటల్ పద్ధతిలో జరిగిపోతోంది. ఒక్క రోజులోనే రుణాలు మంజూరవుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఒక్క రోజులో కాదు... కేవలం ఒకే ఒక్క గంటలో రుణాలు మంజూరు చేస్తున్నాయి బ్యాంకులు. ఇందుకోసం ప్రభుత్వ రంగ బ్యాంకులు కలిసి పీఎస్బీ లోన్స్ ఇన్ 59 మినిట్స్ (PSB Loan in 59 Minutes) అని ఓ ప్లాట్ఫామ్ కూడా రూపొందించాయి. మొదట్లో ఈ ప్లాట్ఫామ్ ద్వారా కేవలం బిజినెస్ లోన్స్ మాత్రమే లభించేవి. కానీ ఇప్పుడు ఎంఎస్ఎంఈ లోన్, ముద్ర లోన్, పర్సనల్ లోన్, హోమ్ లోన్, ఆటో లోన్ లాంటి అనేక సేవలు ఈ ప్లాట్ఫామ్ ద్వారా లభిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. పీఎస్బీ లోన్స్ ఇన్ 59 మినిట్స్ ప్లాట్ఫామ్ 2018 సెప్టెంబర్ 29న ప్రారంభమైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు ఈ ప్లాట్ఫామ్ ద్వారా బిజినెస్ లోన్ కేటగిరీలో 2,01,863 రుణాలు మంజూరయ్యాయి. రూ.39,580 కోట్ల రుణాలు మంజూరు చేశాయి బ్యాంకులు. రీటైల్ లోన్ కేటగిరీలో 17,791 రుణాలు మంజూరయ్యాయి. రూ.1,689 కోట్లు మంజూరు చేశాయి ప్రభుత్వ రంగ బ్యాంకులు. (ప్రతీకాత్మక చిత్రం)
4. పీఎస్బీ లోన్స్ ఇన్ 59 మినిట్స్ ప్లాట్ఫామ్లో మీరు కూడా ఎంఎస్ఎంఈ లోన్, ముద్ర లోన్, పర్సనల్ లోన్, హోమ్ లోన్, ఆటో లోన్ కోసం దరఖాస్తు చేయొచ్చు. వ్యాపారం కోసం అయితే జీఎస్టిఐఎన్, జీఎస్టీ యూజర్ నేమ్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉండాలి. ఇక ఏ లోన్ తీసుకోవాలన్నా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు బ్యాంక్ స్టేట్మెంట్, ఇతర లోన్ల వివరాలు అప్లోడ్ చేయాలి. మరి పీఎస్బీ లోన్స్ ఇన్ 59 మినిట్స్ ప్లాట్ఫామ్లో రుణాలకు ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
5. పీఎస్బీ లోన్స్ ఇన్ 59 మినిట్స్ ప్లాట్ఫామ్లో రుణాలకు అప్లై చేయడానికి ముందుగా https://www.psbloansin59minutes.com/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. పేరు, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి Get OTP పైన క్లిక్ చేయాలి. మీ మొబైల్ నెంబర్కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి.
నియమనిబంధనలు అంగీకరించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. అన్ని కాలమ్స్ పూర్తి చేసి Proceed పైన క్లిక్ చేయాలి. మీ పేరుతో అకౌంట్ క్రియేట్ చేయడానికి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ అకౌంట్ వివరాలతో లాగిన్ కావాలి. మీరు ఏ లోన్ తీసుకోవాలనుకుంటే ఆ లోన్ పైన క్లిక్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. మీ బ్యాంకు వివరాలు ఎంటర్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)