రుణాలు తీసుకొని వాటిని సరైన సమయానికి తిరిగి చెల్లించడం అనేది అందరికీ సాధ్యమయ్యే పనికాదు. ఎక్కువ వడ్డీలు చెల్లించాల్సి వచ్చినప్పుడు భారం ఇంకా ఎక్కువగా ఉంటుంది. బడ్జెట్‌ను సక్రమంగా నిర్వహించుకోవాలంటే క్రెడిట్ కార్డుల బిల్లులు, ఇతర అధిక వడ్డీ చెల్లించాల్సిన రుణాలను తీర్చడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. భవిష్యత్తులో హోంలోన్ తీసుకొనేందుకు అర్హత సాధించాలంటే పాటించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
వీలైనప్పుడు ఈఎంఐ అదనంగా చెల్లించాలి
అప్పులను తగ్గించుకొనే క్రమంలో వీలైనంత త్వరగా ఈఎంఐలు పూర్తి చేసుకోవాలి. ఏటా చెల్లించాల్సిన మొత్తం కంటే ఎక్కువ చెల్లించగలమో లేదా పరిశీలించుకోవాలి. ఎక్కువగా చెల్లించగలిగితే అధిక వడ్డీ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అంతే త్వరగా లోన్‌ను కూడా తీర్చేయవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
అందుకే అదనంగా ఈఎంఐ(EMI- ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్) లేదా ఒకేసారి పెద్ద మొత్తం చెల్లించడం చేయాలి. ఉదాహరణకు నెలకు రూ.30,000 వేలు ఈఎంఐ చెల్లించడం.. రూ.15,000 ఈఎంఐతో పోలిస్తే కష్టం. కానీ ఈఎంఐ ఎక్కువగా ఉంటేనే ఉపయోగం. మొత్తంపై చెల్లించాల్సిన వడ్డీ చాలా వరకు తగ్గుతుంది. హోంలోన్ కూడా త్వరగా తీర్చేయవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
తక్కువ వడ్డీ రేటుతో మీ హోమ్ లోన్ రీఫైనాన్స్ చేయండి
అప్పుల భారం ఎక్కువగా ఉంటే తక్కువ వడ్డీకి లభించే హోంలోన్ ఉపయోగపడుతుందేమో పరిశీలించండి. అప్పటికే హోంలోన్ ఉన్న వారికి వడ్డీరేట్లు తగ్గడం మేలు చేస్తుంది. దీంతో త్వరగా హోంలోన్ తీర్చేయడమే కాకుండా ఎక్కువ వడ్డీ చెల్లించకుండా బయటపడవచ్చు. ఇక్కడ రెండు మార్గాలు ఉన్నాయి.. ప్రస్తుతం లోన్ తీసుకొన్న చోట రీఫైనాన్స్ చేయవచ్చు లేదా తక్కువ వడ్డీ రేట్ అందిస్తున్న మరో సంస్థకు బ్యాలెన్స్‌ను బదిలీ చేసుకోవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
రీఫైనాన్సింగ్ లేదా తక్కువ వడ్డీ రేట్‌కు హోంలోన్ అందిస్తున్న సంస్థకు ప్రస్తుత హోంలోన్‌ను ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఇప్పుడు చాలా సులువైన ప్రక్రియ. రెండు మూడు క్లిక్‌లతోనే తక్కువ వడ్డీరేటుకు హోంలోన్ అందిస్తున్న సంస్థను ఎంచుకొని రుణం కోసం అప్లై చేసేయవచ్చు. ప్రతినెలా చేస్తున్న చెల్లింపులు తగ్గించుకోవాలనుకొనే వారికి, అధిక వడ్డీల భారం తీర్చుకోవాలనుకొనేవారికి ఇది మంచి అవకాశం. అదే విధంగా వివిధ లోన్లకు చెల్లించాల్సిన మొత్తాన్ని ఒక పేమెంట్ కిందకు తీసుకురావడం ద్వారా ప్రతినెలా తిరిగి చెల్లించడంపై ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
అదనపు ఆదాయ మార్గాలు అన్వేషించండి
రుణాల భారాన్ని తగ్గించుకోవాలంటే అదనపు ఆదాయ మార్గాలను కూడా సృష్టించుకోవాలి. ఇంకో ఉద్యోగం చేయడం, ఖర్చులను తగ్గించుకోవడం, అదే విధంగా మీ వద్ద ఉన్న అనవసరమైన వాటిని విక్రయించడం కూడా ఆదాయం మార్గంగానే పరిగణించాలి. ఫ్రీలాన్సింగ్ లేదా పార్ట్‌టైమ్ జాబ్‌ల ద్వారా కూడా అదనపు ఆదాయం పొందవచ్చు. ఈ విషయం ఇంతకు ముందే చాలా మంది విని ఉంటారు. ఇప్పుడు చాలా ప్రాచుర్యంలోకి కూడా వచ్చింది. అదనపు ఆదాయం పొందడం కోసం ఫ్రీలాన్సింగ్ ఉత్తమ మార్గం. చాలా సంస్థలు రైటర్స్, డిజైనర్స్, హోంలోన్ అడ్వైజర్స్, ట్రాన్స్‌లేటర్స్, ఎక్కువ అనుభవం, అర్హత అవసరం లేని కొన్ని ఉద్యోగాలకు ఫ్రీలాన్సర్లను కోరుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
అప్పుల భారంతో ఇబ్బంది పడుతూ కూడా.. హోంలోన్ ఈఎంఐ చెల్లించగలుగుతుంటే.. పరిష్కారం కనుక్కోవాల్సిన అవసరం ఉంది. రుణాల నుంచి బయటపడాలంటే ఇంటి యజమానిగా హోంలోన్‌ను నిర్వహించడానికి కొన్ని మార్గాలు ఉంటాయి. మొదటిది వీలైనంత త్వరగా హోంలోన్ తిరిగి చెల్లించేయాలి. దీంతో అధిక వడ్డీ చెల్లించాల్సిన అవసరం తప్పుతుంది. ప్రాపర్టీపైన ఈక్విటీని బిల్డ్ చేయవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)