1. మీరు ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నారా? కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారా? అయితే ఈ పెన్షన్ స్కీమ్ మీకోసమే. భారతదేశంలో పొదుపు పథకాల్లో నేషనల్ పెన్షన్ స్కీమ్-NPS ఒకటి. దీని ద్వారా రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. దీంతో పాటు మరో రూ.50,000 ప్రయోజనాలు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో చేరినవారు మొదట కనీసం రూ.500 డిపాజిట్ చేయాలి. ఆ తర్వాత ప్రతీ ఏడాది కనీసం రూ.1,000 జమ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఉన్నట్టై ప్రైవేట్ ఉద్యోగులకు పెన్షన్ ప్లాన్ ఇది. ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారినా పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్-PRAN మార్చకుండా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3. సూపర్ యాన్యుయేషన్ ఫండ్స్‌ని ఎన్‌పీఎస్‌కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. 70 ఏళ్ల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. నేషనల్ పెన్షన్ స్కీమ్-NPS లో ఎంత తక్కువ వయస్సులో చేరితే అంత ఎక్కువ లాభం ఉంటుంది. 30 ఏళ్ల వయస్సు ఉన్నప్పటి నుంచి నెలకు రూ.5,000 లోపు జమ చేస్తే చాలు వృద్ధాప్యంలో నెలకు రూ.19,000 పెన్షన్ పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఈ స్కీమ్‌తో పన్ను ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. అందుకే ఎక్కువ ట్యాక్స్ బ్రాకెట్లో ఉండేవారు ఈ స్కీమ్ ఎంచుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ప్రైవేట్ ఉద్యోగులు కూడా ఈ స్కీమ్‌లో చేరొచ్చు. ఇందులో ఉద్యోగి వేతనంలో 10 శాతం (బేసిక్+డీఏ) వరకు ఈ స్కీమ్‌లో జమ చేసి పన్ను ప్రయోజనాలు పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
7. ప్రైవేట్ ఉద్యోగులు సెక్షన్ 80సీ కింద గరిష్టంగా ఏడాదికి రూ.1,50,000 వరకు మినహాయింపులు పొందొచ్చు. ఎన్పీఎస్ టైర్ 1 అకౌంట్లో జమ చేస్తే రూ.50,000 వరకు మినహాయింపు పొందేందుకు అనుమతి ఉంది. ఎన్పీఎస్ టైర్ 2 అకౌంట్లో ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులు జమ చేస్తే సెక్షన్ 80సీ కింద మినహాయింపులు ఉండవు. లాకిన్ కూడా వర్తించదు. (ప్రతీకాత్మక చిత్రం)