1. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జనవరి 13న గంగా విలాస్ యాత్ర ప్రారంభించనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ క్రూజ్ టూర్ (River Cruise Tour) ఇది. 51 రోజుల పాటు టూర్ కొనసాగుతుంది. వారణాసిలో టూర్ ప్రారంభమై అస్సాంలోని దిబ్రుగఢ్‌లో యాత్ర ముగుస్తుంది. లగ్జరీ క్రూజ్‌లో యాత్ర భారతదేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల మీదుగా సాగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఈ లగ్జరీ క్రూజ్ ఐదు రాష్ట్రాలు, బంగ్లాదేశ్‌లోని 27 నదీ వ్యవస్థల మీదుగా 3,200 కిలోమీటర్ ప్రయాణిస్తుంది. మొత్తం 51 రోజుల యాత్రలో 50 టూరిస్ట్ స్పాట్స్ కవర్ అవుతాయని అంచనా. ఇందులో ఆధ్యాత్మిక క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు, జాతీయ ఉద్యానవనాలు, ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, పాట్నా, గౌహతి, కోల్‌కతా, బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నగరాలు కవర్ అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)