4. సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు టైమింగ్స్ అధికారికంగా తెలిశాయి. రైలు నెంబర్ 20701 ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్లో బయల్దేరుతుంది. ఈ రైలు నల్గొండకు ఉదయం 7.19 గంటలకు, ఉదయం 9.45 గంటలకు గుంటూరుకు, ఉదయం 11.09 గంటలకు ఒంగోలుకు, మధ్యాహ్నం 12.29 గంటలకు నెల్లూరుకు, మధ్యాహ్నం 2.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు 660.77 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. 8.30 గంటల్లో సికింద్రాబాద్ తిరుపతి మధ్య ప్రయాణిస్తుంది. ఇతర వందే భారత్ రైళ్లతో పోలిస్తే ఈ రైలు కాస్త తక్కువ వేగంతోనే ప్రయాణిస్తుంది. గంటకు 77 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని అంచనా. అయితే ఇప్పటికే సికింద్రాబాద్-తిరుపతి రూట్లో ఉన్న ఇతర రైళ్లతో పోలిస్తే వందే భారత్ రైలులో తక్కువ సమయంలోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఇక భారతీయ రైల్వే మరిన్ని వందే భారత్ రైళ్లను నడిపేందుకు కసరత్తు చేస్తోంది. త్వరలోనే కాచిగూడ-బెంగళూరు, సికింద్రాబాద్-పూణె రూట్లలో వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఇక ఏప్రిల్ 8న చెన్నై-కొయంబత్తూర్ రూట్లో మినీ వందే భారత్ రైలు ప్రారంభం కానుంది. ఈ రైలులో 8 బోగీలు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు నడుస్తున్న వందే భారత్ రైలులో 16 బోగీలున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)