1. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) రైలును ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి కానుకగా సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ రైలును వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. (image: Indian Railways)
2. సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య పరుగులు తీయనున్న వందే భారత్ రైలు ఎలా ఉంటుందో చూడాలన్న ఆసక్తి రైల్వే ప్రయాణికుల్లో ఉంది. వందే భారత్ రైలు బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి కాబట్టి రైల్వే ప్రయాణికులు ఈ రైలు ఎక్కి స్వయంగా వందే భారత్ రైలు ప్రత్యేకతల్ని తెలుసుకునే అవకాశం ఉంది. (image: Indian Railways)
4. వందే భారత్ రైలులోని సీట్లు 180-డిగ్రీలు తిరుగుతాయి. 32-అంగుళాల స్క్రీన్, రెస్ట్రూమ్లు, సీట్ హ్యాండిల్స్‌పై బ్రెయిలీ లిపిలో సీట్ నెంబర్స్... ఇలా అనేక ఫీచర్స్ ఉన్నాయి. సెఫ్టీ విషయానికి వస్తే నాలుగు ప్లాట్‌ఫారమ్ సైడ్ కెమెరాలు, జీపీఎస్, ఆటోమేటిక్ డోర్లు, ఫైర్ సెన్సార్లు, సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. (image: Indian Railways)