1. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలోని (PM Kisan Scheme) రైతులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్ పథకానికి చెందిన 11వ ఇన్‌స్టాల్‌మెంట్‌ను విడుదల చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ షిమ్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పీఎం కిసాన్ డబ్బుల్ని రిలీజ్ చేశారు. 10 కోట్లకు పైగా రైతులకు రూ.21,000 కోట్లు జమ చేసింది కేంద్ర ప్రభుత్వం. (ప్రతీకాత్మక చిత్రం)
2. రైతుల అకౌంట్లలోకి రూ.2,000 చొప్పున జమ చేస్తోంది. ప్రభుత్వం. రైతులు చాలాకాలంగా పీఎం కిసాన్ స్కీమ్ 11వ ఇన్స్టాల్మెంట్ (PM Kisan 11th Installment) కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొదటి వాయిదా ఇది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా రైతులకు ప్రతీ ఏటా రూ.2,000 చొప్పున మూడు వాయిదాల్లో రూ.6,000 జమ చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా రైతులు డబ్బులు పొందాలంటే ఇకేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. మే 31 లోగా ఇకేవైసీ పూర్తి చేసిన రైతుల అకౌంట్లలోకి రూ.2,000 జమ కానుంది. మరి మీరు పీఎం కిసాన్ లబ్ధిదారులైతే పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు వచ్చాయో లేదో ఇలా చెక్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4. పీఎం కిసాన్ వెబ్సైట్లో లబ్ధిదారుల జాబితా చెక్ చేయడానికి రైతులు పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ https://pmkisan.gov.in/ ఓపెన్ చేయాలి. Farmers corner సెక్షన్లో Beneficiary Status పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ఆధార్ నెంబర్ లేదా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఆప్షన్స్‌లో ఏదైనా ఒకటి ఎంచుకోవాలి. ఆధార్ నెంబర్ లేదా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత Get Data పైన క్లిక్ చేయాలి. రైతుల అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయో లేదో స్టేటస్ తెలుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. పీఎం కిసాన్ మొబైల్ యాప్‌లో లబ్ధిదారుల జాబితా చెక్ చేయడానికి ముందుగా గూగుల్ ప్లేస్టోర్ నుంచి PMKISAN GoI డౌన్లోడ్ చేయాలి. National Informatics Centre రూపొందించిన యాప్ మాత్రమే ఇన్స్టాల్ చేయాలి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజీలో Beneficiary Status పైన క్లిక్ చేయాలి. ఆధార్ నెంబర్ లేదా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఆప్షన్స్‌లో ఏదైనా ఒకటి ఎంచుకోవాలి. ఆధార్ నెంబర్ లేదా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత Get Data పైన క్లిక్ చేయాలి. రైతుల అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయో లేదో స్టేటస్ తెలుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. లబ్ధిదారుల వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే పీఎం కిసాన్ డబ్బులు జమ కావు. గతంలో అనేక సందర్భాల్లో ఇదే జరిగింది. లబ్ధిదారులు సమర్పించిన డాక్యుమెంట్లలో, బ్యాంకు అకౌంట్లలో పేర్లు వేర్వేరుగా ఉండటం లేదా ఇతర కారణాలతో డబ్బులు రావు. అందుకే వివరాలు తప్పుగా ఉంటే సరిచేసుకోవడం అవసరం. ఇందుకోసం ఈ స్టెప్స్ ఫాలో కావాలి. (ప్రతీకాత్మక చిత్రం)