1. నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. ఓవైపు పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol Diesel Prices) పెరిగిపోవడం, ఆ ప్రభావం పరోక్షంగా ఇతర వస్తువులపై ఉండటం, రవాణా ఛార్జీలు పెరిగిపోవడంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయ పరిణామాల కారణంగా ఇప్పటికే వంటనూనెల ధరలు భారీగా పెరిగాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఈ ధరల పెరుగుదల ఇంకొన్నిరోజులు ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్యోల్బణ అంచనాల సర్వే వెల్లడించింది. రాబోయే మూడు నెలలు కుటుంబ ద్రవ్యోల్బణం 10 బేసిస్ పాయింట్స్ పెరిగి 10.7 శాతానికి, ఒక ఏడాది ద్రవ్యోల్బణం 10 బేసిస్ పాయింట్స్ పెరిగి 10.8 శాతానికి చేరుకుంటుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. తాజా సర్వే రౌండ్లో ప్రస్తుత కాలానికి ఇంటి మధ్యస్థ ద్రవ్యోల్బణం 9.7 శాతం దగ్గర అలాగే ఉందని, 2022 జనవరి రౌండ్‌తో పోలిస్తే రాబోయే మూడు నెలలు, ఏడాది ద్రవ్యోల్బణం 10 బేసిస్ పాయింట్స్ పెరిగి 10.7 శాతం, 10.8 శాతం కానుందని ఆర్బీఐ హౌజ్‌హోల్డ్స్ ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్స్ సర్వేలో తేలింది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఆర్బీఐ 2022-23 రీటైల్ ద్రవ్యోల్బణాన్ని 5.7 శాతంగా అంచనా వేసింది. కానీ గతంలో 4.5 శాతంగా ముందుగా అంచనా వేసింది ఆర్బీఐ. ప్రపంచవ్యాప్తంగా సరఫరా కొరత కారణంగా ధరలపై ఒత్తిడి కొనసాగవచ్చని, పౌల్ట్రీ, పాలు, పాల ఉత్పత్తుల ధరలపై ప్రభావం ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)