ఇప్పుడు తాజాగా కోసం ఓ స్టార్టప్ కంపెనీ ఈవీని రూపొందించింది. బెంగళూరుకు చెందిన ప్రవైగ్ (PRAVAIG) కంపెనీ.. సైన్యానికి ఉపయోగపడేలా కొత్త ఈవీని లాంచ్ చేయనుంది. వీర్ EV (Veer EV) పేరుతో తీసుకొస్తున్న ఈ వెహికల్‌ను ఆటో ఎక్స్పో 2023లో ఇంట్రడ్యూస్ చేసింది. 2022 నవంబర్‌లో ప్రవైగ్ డెఫీ లాంచ్ సందర్భంగా మొదటిసారి వీర్ ఈవీని ప్రదర్శించింది. వీర్ EV బ్యాటరీ 10 లక్షల కిలోమీటర్ల కంటే ఎక్కువ లైఫ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
వీర్ ఈవీ ప్రత్యేకతలు : వీర్ EV పొడవు 4,940 mm, వెడల్పు 1,950 mm, ఎత్తు 1,650 mmగా ఉన్నాయి. ఎలక్ట్రిక్ ఆఫ్-రోడర్ 3,030 mm వీల్‌బేస్‌ను అందిస్తుంది. ఇందులో నాలుగు సీట్లు ఉన్నాయి. డివైజెస్‌ను ప్యాక్ చేయడానికి, సేఫ్‌గా భద్రపరచడానికి తగినంత స్థలం ఉంది. వీర్ బరువు 1,870 కిలోలని, 2,500 కిలోల బరువును లాగుతుందని, 690 కిలోల సరుకును మోయగలదని ప్రవైగ్ పేర్కొంది.
వీర్ ఈవీ Defy SUV బేస్డ్ ఆఫ్-రోడ్ వెహికల్. ఇది రోల్‌బార్, బోనెట్, ఫెండర్స్, బూట్ వంటి స్టాండర్డ్ కిట్ ఐటమ్‌లతో స్కెలిటెన్ డిజైన్‌తో వస్తుంది. సులువుగా వెహికల్లోకి ఎక్కి, దిగే సౌలభ్యం కోసం దీనికి డోర్స్ ఏర్పాటు చేయలేదు. వీర్ ఈవీని క్లోజ్డ్ క్యాబిన్ డిజైన్ ఉండేలా కూడా తయారు చేయవచ్చని కంపెనీ తెలిపింది. దీని ఇంటీరియర్‌ను సింపుల్‌గా ఉంచింది. అన్ని కంట్రోల్స్ టచ్‌స్క్రీన్‌పై ఉంటాయి. సెంటర్లో స్క్రీన్ పొందుపరిచారు. వీర్ ఎలక్ట్రిక్ SUVని అవసరాన్ని బట్టి కస్టమైజ్ చేసుకోవచ్చని ప్రవైగ్ పేర్కొంది.
2,500 కిలోల బరువు లాగుతుంది : వీర్ EV చాలా రకాల ఫీచర్లను అందిస్తుంది. ఇది థర్మల్ ఇమేజింగ్ సెన్సార్, ఎయిర్‌లిఫ్ట్ హుక్స్, నాలుగు-టన్నుల వించ్, రెండు-టన్నుల టో హిచ్, సామగ్రి కోసం IP 65-రేటెడ్ స్టోరేజ్ స్పేస్ అందిస్తుంది. వీర్ రన్-ఫ్లాట్ టైర్స్‌తో రూపొందింది. ఇది టైర్లు పంక్చర్ అయినప్పుడు కూడా ప్రయాణించేలా వీలు కల్పిస్తుంది.