ఇంకా ఈ కారులో ఎయిర్ ఫ్యూరిఫయర్లు, స్మూత్ సస్పెన్షన్, మల్టీ వీఏసీ హై పర్ఫార్మెన్స్ సర్వర్స్ అండ్ సెన్సార్స్, వానిటీ మిర్రర్స్, ఆన్‌బోర్డ్ అల్ట్రా ఫాస్ట్ వైఫై, లార్జ్ లెగ్ రూమ్ సహా ఇతర ఫీచర్లు కూడా ఉండనున్నాయి. యూఎస్బీ సీ, వైర్లెస్ చార్జింగ్, గ్రేట్ స్పీకర్లు, మిర్రర్ కంటెంట్ వంటి ప్రత్యేకతలు కూడా ఉండనున్నాయి.
ఇంకా ఈ కారులో 5 స్టార్ రేటింగ్ సేఫ్టీ ఫీచర్లు కూడా ఉండనున్నాయి. అంటే కారు ఏ రేంజ్లో ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. కాగా ఈ కారు ఈ నెలలోనే మార్కెట్‌కి రానుంది. మార్కెట్లోకి వచ్చిన తర్వాత కారు పనితీరు ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. కాగా ప్రస్తుతానికి మార్కెట్లో టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల హవా కొనసాగుతోంది. ఈ కంపెనీ ఇప్పటికే పలు మోడళ్లను ఎలక్ట్రిక్ వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందిస్తోంది.