కేంద్ర ప్రభుత్వం వీధి వ్యాపారుల కోసం ప్రత్యేకమైన రుణ పథకాన్ని తీసుకువచ్చింది. దీని పేరు పీఎం స్వనిధి స్కీమ్. ఈ పథకం కింద అర్హత కలిగిన వీధి వ్యాపారులు సులభంగానే రుణం పొందొచ్చు. రూ.10 వేలు ఇస్తారు. తీసుకున్న రుణాన్ని కరెక్ట్ టైమ్‌కి లేదంటే ముందుగానే చెల్లిస్తే.. వడ్డీ రాయితీ లభిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. (ప్రతీకాత్మక చిత్రం)
వ్యాపారులు, వీధి వ్యాపారులు తమతమ వ్యాపారాన్ని మరింతగా పెంచుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. కేంద్ర ప్రవేశపెట్టిన పథకాలలో పీఎం స్వీనిధి ఒకటి. ఈ పథకాన్ని 2020 జూన్ 1న ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఈ పథకం ద్వారా వ్యాపారులు రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)