ఒక నివేదిక ప్రకారం భారతదేశంలో 42 కోట్ల మంది అసంఘటిత కార్మికులు ఉన్నారని అంచనా. ఈ స్కీమ్‌లో చేరిన వారికి ప్రతి నెలా రూ.3 వేల పెన్షన్ వస్తుంది. ఈ పథకం లక్ష్యం లబ్ధిదారునికి రూ. 60 ఏళ్ల తర్వాత ప్రతి నెలా 3,000, అలాగే.. లబ్ధిదారుని మరణానంతరం పెన్షన్‌లో 50 శాతం లబ్ధిదారుని జీవిత భాగస్వామికి కుటుంబ పెన్షన్‌గా ఇవ్వబడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
వీరంతా రోజుకు కనీసం రూ.2 ఆదా చేస్తే.. నెలకు రూ.3 వేలు పన్షన్ అంటే.. సంవత్సరానికి రూ.36 వేలు పెన్షన్ పొందవచ్చు. ఈ స్కీంలో చేరాలంటే.. 18 ఏళ్ల వయస్సులో చేరేవారు నెలకు రూ.55 చెల్లిస్తే సరిపోతుంది(అంటే దాదాపు రోజుకు రూ.2). అదే 40 ఏళ్ల వయస్సులో చేరే వారు నెలకు రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఇలా 60 ఏళ్లు వచ్చేదాకా అంటే 20 సంవత్సరాలు డబ్బులను ఆదా చేయాల్సి వస్తుంది. తర్వాత 60 ఏళ్లు దాటిని తర్వాత రూ.3వేలు పెన్షన్ పొందొచ్చు. దీనికి కావాల్సిన డాక్యుమెంట్లు బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్. పూర్తి వివరాలకు కోసం https://maandhan.in/scheme/pmsym వెబ్ సైట్ ను సందర్శించండి.