1. కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అందిస్తోంది. అయితే అన్ని పథకాల గురించి అవగాహన లేక ప్రజలు బెనిఫిట్స్ పొందలేకపోతున్నారు. ఓ పథకం ద్వారా ఇప్పటివరకు రూ.11,522 కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వం అనేక సామాజిక భద్రతా పథకాలల్లో ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) స్కీమ్ కూడా ఒకటి. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఈ స్కీమ్ 2015 మే 9న ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన బీమా పథకం ఇది. పౌరులకు బీమా రక్షణ ఉండాలన్న లక్ష్యంతో ఈ స్కీమ్ ప్రారంభించింది. ప్రతీ ఒక్కరికి రూ.2,00,000 బీమా ప్రయోజనం లభిస్తుంది. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) స్కీమ్‌కు ఏడేళ్లు పూర్తైంది. 2022 ఏప్రిల్ 27 వరకు ఈ స్కీమ్‌లో 12.76 కోట్ల మంది చేరారు. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఏడేళ్లలో 5,76,121 క్లెయిమ్స్ సెటిల్ చేసిన కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.11,522 కోట్లు మంజూరు చేసింది. ఈ స్కీమ్‌లో చేరినవారి నామినీలకు రూ.2,00,000 చొప్పున జమచేసినట్టు ఆర్థిక శాఖ వివరించింది. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన స్కీమ్ ద్వారా రూ.2,00,000 ఇన్స్యూరెన్స్ బెనిఫిట్ పొందాలంటే రూ.330 వార్షిక ప్రీమియం చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4. రూ.330 చెల్లిస్తే ఒక ఏడాది మాత్రమే ఇన్స్యూరెన్స్ వర్తిస్తుంది. ప్రతీ ఏటా రెన్యూవల్ చేయడం తప్పనిసరి. ఈ స్కీమ్‌లో ఎవరైనా చేరొచ్చు. వయస్సు 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. 55 ఏళ్ల వరకు బీమా వర్తిస్తుంది. ప్రభుత్వ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా ఈ ఇన్స్యూరెన్స్ స్కీమ్ అందుబాటులో ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మరణించినవారికి కూడా ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన స్కీమ్ వర్తించడం విశేషం. వారి కుటుంబ సభ్యులకు ఈ స్కీమ్ ద్వారా రూ.2,00,000 బీమా లభించింది. ఇన్స్యూరెన్స్ తీసుకున్న వ్యక్తి పాలసీని యాక్టీవ్‌గా ఉంచడానికి ప్రతీ ఏటా రూ.330 చెల్లిస్తూ ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. బ్యాంకులో ఆటో డెబిట్ ఆప్షన్ ఎంచుకుంటే ప్రతీ ఏటా ప్రీమియం ఆటోమెటిక్‌గా డెబిట్ అవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకొని మరీ ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. పాలసీ యాక్టీవ్‌గా ఉన్నప్పుడు పాలసీదారు మరణిస్తేనే వారి నామినీకి ఇన్స్యూరెన్స్ డబ్బులు లభిస్తాయి. కుటుంబ సభ్యులు పాలసీ వివరాలు, పాలసీ హోల్డర్ వివరాలతో క్లెయిమ్ కోసం దరఖాస్తు చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఏ బ్యాంకులో పాలసీ తీసుకుంటే అదే బ్యాంకులో ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ ఫామ్ సబ్మిట్ చేయొచ్చు. ఎప్పుడు పాలసీ తీసుకున్నా మే 31 వరకే ఉంటుంది. మే 25 నుంచి మే 31 మధ్య రెన్యువల్ ప్రీమియం చెల్లించాలి. తర్వాతి ఏడాదికి పాలసీ యాక్టీవ్ అవుతుంది. ఈ స్కీమ్‌లో మధ్యలో చేరితే మొదటి ఏడాది ప్రీమియంలో మార్పు ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8. జూన్ నుంచి ఆగస్ట్ మధ్య ఈ స్కీమ్‌లో చేరితే రూ.330, సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య చేరితే రూ.258, డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య చేరితే రూ.172, మార్చి నుంచి మే మధ్య చేరితే రూ.86 ప్రీమియం చెల్లించాలి. ఆ తర్వాతి ఏడాది నుంచి రూ.330 చొప్పున చెల్లించాలి. ఈ పాలసీలో రెగ్యులర్‌గా డబ్బులు చెల్లించేవారు స్కీమ్‌లో ఉన్నట్టే. అయితే మూడు సందర్భాల్లో ఈ పాలసీ వర్తించదు. (ప్రతీకాత్మక చిత్రం)
9. పాలసీ తీసుకున్న వ్యక్తికి 55 ఏళ్లు పూర్తైతే పాలసీ గడువు ముగుస్తుంది. ఒకవేళ ప్రీమియం చెల్లించడానికి అకౌంట్లో బ్యాలెన్స్ లేకపోయినా పాలసీ వర్తించదు. ఒకరు ఒక పాలసీ మాత్రమే తీసుకోవాలి. వేర్వేరు అకౌంట్ల ద్వారా పాలసీ తీసుకుంటే ఒక పాలసీ మాత్రమే వర్తిస్తుంది. మిగతా పాలసీలు వర్తించవు. వారికి రూ.2,00,000 బీమా మాత్రమే లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)