దేశంలోని 3.3 లక్షలకు పైగా ఎరువుల రిటైల్ దుకాణాలను దశల వారీగా పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా మార్చాలని కేంద్రం భావిస్తోంది. రైతులు వీటి ద్వారా విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు వంటివి పొందొచ్చు. ఇంకా నేల, విత్తనాలు, ఎరువులను పరీక్షించుకోవచ్చు. వీటిల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం కూడా అందుబాటులో ఉంటుంది.