1. లక్షాధికారులు, కోటీశ్వరులు కావాలంటే ముందుగా ఆర్థిక క్రమశిక్షణ అవసరం. ఆర్థిక క్రమశిక్షణ ఉంటే లక్షాధికారులు కూడా కోటీశ్వరులు కావొచ్చు. కానీ ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే కోటీశ్వరులు కూడా చివరకు చిల్లిగవ్వ లేకుండా మిగిలిపోతుంటారు. అందుకే దీర్ఘకాలంపాటు డబ్బు పొదుపు (Money Saving Tips) చేసే అలవాటు ఉంటే మంచి సంపద కూడబెట్టొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
2. ప్రతీ నెలా కొంత మొత్తం పొదుపు చేస్తూ ఉంటే కోటీశ్వరులు కావొచ్చంటే నమ్ముతారా? ఇది సాధ్యమే. ఇందుకోసం ఆర్థిక క్రమశిక్షణ కావాలి. డబ్బు పొదుపు చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి కోట్లు సంపాదించొచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో రిస్క్ ఎక్కువ. రిస్క్ లేకుండా పొదుపు చేయాలంటే ప్రభుత్వం నుంచి అనేక పొదుపు పథకాలు (Govt Saving Schemes) ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పొదుపు పథకాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) కూడా ఒకటి. ఇందులో డబ్బు పొదుపు చేస్తే వచ్చే రిటర్న్స్‌పై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. చక్రవడ్డీ అంటే వడ్డీపై వడ్డీ అందించే పొదుపు పథకాల్లో కూడా ఇది కూడా ఒకటి. చక్రవడ్డీతో రిటర్న్స్ బాగా వస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. మ్యూచువల్ ఫండ్స్‌తో పాటు ఇతర పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే రిటర్న్స్‌పై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అందుకే పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయాలని చెబుతుంటారు పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్. పీపీఎఫ్ అకౌంట్లో డబ్బులు జమ చేయడం ద్వారా కోటీశ్వరులు కావొచ్చు. ప్రతీ ఏటా పీపీఎఫ్ అకౌంట్లో రూ.1,50,000 వరకు జమ చేయొచ్చు. అంటే నెలకు రూ.12,500 చొప్పున జమ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో దాచుకునే డబ్బులకు పన్ను మినహాయింపు ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద రూ.1,50,000 వరకు జమ చేసి పన్ను మినహాయింపులు పొందొచ్చు. ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినా ఈ మినహాయింపు ఉంటుంది. పీపీఎఫ్తో పోలిస్తే ఈఎల్ఎస్ఎస్ రిటర్న్స్ ఎక్కువగా ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. కానీ పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేస్తే రిస్కు ఉండదు. పీపీఎఫ్ స్కీమ్ వడ్డీని ప్రభుత్వం సవరిస్తూ ఉంటుంది. వడ్డీ పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. ఈ వడ్డీ తగ్గితే రిటర్న్స్ తగ్గుతాయి. వడ్డీ పెరిగితే రిటర్న్స్ పెరుగుతాయి. పీపీఎఫ్ అకౌంట్లో 30 ఏళ్ల పాటు డబ్బులు జమ చేయాలంటే పొదుపు చాలా ముందుగా ప్రారంభించాలి. (ప్రతీకాత్మక చిత్రం)