పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(Public Provident FUnd) అనేది అత్యంత ప్రజాదరణ పొందిన పదవీ విరమణ పొదుపు పథకం. ప్రతి సంవత్సరం లక్షల మంది ఈ పథకంలో పెట్టుబడి పెడుతున్నారు. ప్రభుత్వ మద్దతుతో ఎక్కువ వడ్డీ అందించే ఈ పథకాన్ని దాదాపు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవచ్చు. ఏడాదికి కనిష్ఠంగా రూ. 500 నుంచి గరిష్ఠంగా రూ.1,50,000 వరకు జమ చేయవచ్చు. ప్రభుత్వ EEE (ఎగ్జెమ్ట్, ఎగ్జెమ్ట్, ఎగ్జెమ్ట్) పరిధిలోకి వచ్చే చాలా తక్కువ పన్ను రహిత పథకాలలో PPF కూడా ఉంది. అంటే PPFలో జమ అయిన మొత్తం, సంపాదించిన వడ్డీ, మెచూరిటీ మొత్తానికి IT చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
ప్రభుత్వ మద్దతుతో కూడిన ఈ పథకంలో చిన్న మొత్తంలో కూడా పొదుపు చేయవచ్చు. దాని మెచూరిటీ సమయంలో కచ్చితమైన రాబడిని అందుకోవచ్చు. అందుకే ఎక్కువ మంది ఈ పథకంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతారు. PPF ప్రస్తుతం సంవత్సరానికి 7.1 శాతం కాంపౌండ్ వడ్డీ రేటును అందిస్తోంది. రిస్క్ లేకుండా అధిక వడ్డీని అందించే పొదుపు పథకం EPF. PPF ఖాతాదారులు కొన్ని షరతుల ప్రకారం సంవత్సరానికి కేవలం 1 శాతం వడ్డీతో వారి ఖాతాపై రుణాన్ని కూడా తీసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)