* నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC) : దేశంలోని పాపులర్ సేవింగ్స్ స్కీమ్‌లలో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC) ఒకటి. ఈ స్కీమ్‌లో ప్రస్తుతం 7% వడ్డీ రేటు ఉంది. ఇది పెట్టుబడిదారునికి పన్ను ప్రయోజనాలు కూడా అందిస్తుంది. NSCలో పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు, కనీస పెట్టుబడి రూ.100. ఒక ఆర్థిక సంవత్సరంలో NSCలో రూ.1.50 లక్షల వరకు చేసిన డిపాజిట్లపై సెక్షన్ 80C కింద ట్యాక్స్ డిడక్షన్ క్లెయిమ్ చేయవచ్చు. స్కీమ్ కాలపరిమితి ఐదేళ్లు. అయితే మెచ్యూరిటీ సమయంలోనే వడ్డీ పొందే అవకాశం ఉంటుంది.
* పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) : సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్‌లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఒకటి. పీపీఎఫ్ ద్వారా అందే రాబడిపై ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్నులను ఆదా చేసుకోవచ్చు. PPF ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు ట్యాక్స్ ఎగ్జమ్షన్ అందిస్తుంది. ఈ స్కీమ్ ద్వారా వచ్చే వడ్డీకి కూడా ట్యాక్స్ ఎగ్జమ్షన్ ఉంటుంది. ఇందులో పెట్టుబడి పెట్టే వ్యక్తులు ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు జమ చేయవచ్చు. ప్రస్తుతం పథకం సంవత్సరానికి 7.1 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఈ స్కీమ్ 15 సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్‌తో వస్తుంది. ఆ తర్వాత స్కీమ్‌ను ఐదేళ్లపాటు పొడిగించుకొనే అవకాశం ఉంది. బ్యాంకుల్లో కూడా పీపీఎఫ్ అకౌంట్ తెరవొచ్చు.
* 5 ఇయర్స్ పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ : 5 ఇయర్స్ కాలపరిమితి కలిగిన పోస్టల్ ఫిక్స్డ్ డిపాజిట్లు, బ్యాంక్ FDల తరహాలోనే వడ్డీకి హామీ ఇస్తాయి. వీటిపై ఆర్థిక సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు ట్యాక్స్ డిడక్షన్ పొందవచ్చు. కనీస పెట్టుబడి రూ.1000, గరిష్ట పరిమితి లేదు. ప్రస్తుతం 5 ఇయర్స్ పోస్టాఫీస్ డిపాజిట్ స్కీమ్ 7 శాతం వడ్డీ అందిస్తోంది.
* సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) : 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తి, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ప్రస్తుతం SCSS వడ్డీ సంవత్సరానికి 8 శాతంగా ఉంది. మెచ్యూరిటీ వ్యవధి ఐదేళ్లు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో రూ.1.5 లక్షల వరకు సెక్షన్ 80C కింద ట్యాక్స్ బెనిఫిట్స్ అందుతాయి. అయితే వచ్చే వడ్డీకి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
* సుకన్య సమృద్ధి యోజన : ఆడపిల్లల భవిష్యత్తుకు రక్షణగా కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్ ప్రస్తుతం సంవత్సరానికి 7.6 శాతం వడ్డీ రేటు అందిస్తోంది. వార్షిక ప్రాతిపదికన వడ్డీ లెక్కిస్తారు. ఈ స్కీమ్‌లో ఆర్థిక సంవత్సరానికి మినిమం రూ.250, మ్యాగ్జిమం రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసిన తేదీ నుంచి 15 సంవత్సరాల పాటు డిపాజిట్లు చేయవచ్చు.