SCSS: ఈ పోస్టాఫీస్ స్కీమ్‌తో డబ్బే డబ్బు.. చేరితే రూ.4 లక్షలు మీవే!
SCSS: ఈ పోస్టాఫీస్ స్కీమ్‌తో డబ్బే డబ్బు.. చేరితే రూ.4 లక్షలు మీవే!
Small Saving Schemes | మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నారా? అయితే గుడ్ న్యూస్. మీకోసం ఒక సూపర్ స్కీమ్ అందుబాటులో ఉంది. రూ. 4 లక్షల లాభం పొందొచ్చు.
Senior Citizen Savings Scheme | చేతిలో డబ్బులు ఉన్నాయా? అయితే వాటిని ఎక్కడ పెట్టాలో అర్థం కావడం లేదా? మీకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ ఇలా చాలా వాటిల్లో డబ్బులు దాచుకోవచ్చు.
2/ 9
వీటిలో రిస్క్ ఉంటుంది. మీరు రిస్క్ లేకుండా రాబడి పొందాలని భావిస్తే మాత్రం ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. అదే స్మాల్ సేవింగ్ స్కీమ్స్. పోస్టాఫీస్‌లో అందుబాటులో ఉన్న సేవింగ్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే కచ్చితమైన రాబడి వస్తుంది. రిస్క్ కూడా ఉండదు.
3/ 9
పోస్టాఫీస్‌లో పలు రకాల స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ కూడా ఒకటి ఉంది. ఇప్పుడు మనం ఈ స్కీమ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ పథకంలో చేరడం వల్ల వడ్డీ రూపంలోనే ఏకంగా రూ. 4 లక్షల రాబడి పొందొచ్చు.
4/ 9
ప్రస్తుతం ఈ స్కీమ్‌లో రూ. 30 లక్షల వరకు డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. గతంలో ఈ లిమిట్ రూ. 15 లక్షల వరకు ఉండేది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2023లో ఈ విషయాన్నివెల్లడించారు.
5/ 9
పోస్టాఫీస్ వెబ్సైట్ ప్రకారం చూస్తే.. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు. అంటే మీరు ఖాతా ఓపెన్ చేసిన దగ్గరి నుంచి ఐదేళ్ల వరకు స్కీమ్ కొనసాగుతుంది. 2023 జనవరి 1 నుంచి ఈ స్కీమ్‌పై వడ్డీ రేటు 8 శాతంగా ఉంది.
6/ 9
సీనియర్ సిటిజన్స్‌కు మాత్రమే వర్తించే ఈ స్కీమ్‌లో రూ. 10 లక్షల ఇన్వెస్ట్ చేశారని అనుకుంటే.. ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం చూస్తే.. మెచ్యూరిటీ సమయంలో రూ. 14 లక్షలు చేతికి వస్తాయి. అంటే వడ్డీ రూపంలోనే రూ. 4 లక్షలు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. అంటే ప్రతి త్రైమాసికం రూ. 20 వేల వస్తాయి.
7/ 9
60 ఏళ్లు లేదా ఆపైన వయసు కలిగిన వారు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. ముందుగానే వీఆర్ఎస్ తీసుకొని ఉంటే.. ఈ సందర్భంలో 55 ఏళ్లు లేదా ఆపైన వయసు కలిగిన వారు ఈ పథకంలో చేరొచ్చు. అయితే రిటైర్మెంట్ బెనిపిట్ను కనీసం ఒక్క నెల అయినా పొంది ఉండాలి.
8/ 9
దగ్గరిలోని పోస్టాఫీస్‌కు వెళ్లి ఈ స్కీమ్‌లో చేరొచ్చు. రూ.లక్ష వరకు మొత్తం అయితే క్యాష్ రూపంలో ఇవ్వొచ్చు. ఈ లిమిట్ దాటితే చెక్ ద్వారా స్కీమ్‌లో చేరాల్సి ఉంటుంది. అలాగే అవసమైన కేవైసీ డాక్యుమెంట్లు కూడా అందించాలి.
9/ 9
ఇకపోతే ఈ స్కీమ్‌లో చేరడం వల్ల సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. రూ. 1.5 లక్షల వరకు ట్యాక్స్ తగ్గించుకోవచ్చు. వడ్డీ ఆదాయం ఏడాదిలో రూ. 50 వేలు దాటితే అప్పుడు టీడీఎస్ కట్ అవుతుంది.