2. ఈ స్కీమ్ పేరు గ్రామ సుమంగళ్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ (Gram Sumangal Rural Postal Life Insurance Scheme). పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న పథకాల్లో ఇది కూడా ఒకటి. గ్రామ్ సుమంగళ్ అకౌంట్లో రోజూ రూ.95 పొదుపు చేయడం ద్వారా రూ.14 లక్షల వరకు రిటర్న్స్ పొందొచ్చు. ఎలాగో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఉదాహరణకు 25 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి 20 ఏళ్ల టెన్యూర్‌తో గ్రామ సుమంగళ్ పాలసీ తీసుకున్నారని అనుకుందాం. సమ్ అష్యూర్డ్ రూ.7,00,000 లక్షలు అనుకుంటే నెలకు రూ.2,853 చెల్లించాలి. అంటే రోజుకు రూ.95 చొప్పున చెల్లిస్తే చాలు. ఇది మనీబ్యాక్ స్కీమ్ కాబట్టి 8, 12, 16 ఏళ్లల్లో 20 శాతం చొప్పున మనీ బ్యాక్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. పాలసీ 20 ఏళ్లు కొనసాగిస్తే మొత్తం రూ.13.72 లక్షల బెనిఫిట్స్ వస్తాయి. ముందే రూ.4,20,000 మనీబ్యాక్ రూపంలో వస్తుంది కాబట్టి మిగతా రూ.9,52,000 మెచ్యూరిటీ సమయంలో లభిస్తుంది. గ్రామ సుమంగళ్ పాలసీని ఎవరైనా తీసుకోవచ్చు. కనీస వయస్సు 19 ఏళ్లు. గరిష్ట వయస్సు చూస్తే 20 ఏళ్ల పాలసీకి 40 ఏళ్లు, 15 ఏళ్ల పాలసీకి 45 ఏళ్లు. అంటే వయస్సు 60 ఏళ్లు పూర్తయ్యేనాటికి పాలసీ పూర్తవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. మనీబ్యాక్ వివరాలు చూస్తే 15 ఏళ్ల పాలసీకి 6, 9, 12 సంవత్సరాల్లో 20 శాతం చొప్పున, మిగతా మొత్తం మెచ్యూరిటీ సమయంలో లభిస్తుంది. 20 ఏళ్ల పాలసీకి 8, 12, 16 సంవత్సరాల్లో 20 శాతం చొప్పున, మిగతా మొత్తం మెచ్యూరిటీ సమయంలో లభిస్తుంది. ఇది ఇన్స్యూరెన్స్ పాలసీ కాబట్టి పాలసీహోల్డర్ పాలసీ కొనసాగుతుండగానే మరణిస్తే సమ్ అష్యూర్డ్ నామినీకి లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)