1. మీరు ప్రతీ నెలా మీ జీతం నుంచి కొంత పొదుపు చేయాలనుకుంటున్నారా? డబ్బు పొదుపు చేయాలనుకునేవారికి అనే స్కీమ్స్ (Savings schemes) ఉన్నాయి. ఇండియా పోస్ట్ (India Post) కూడా పోస్ట్ ఆఫీసుల ద్వారా అనేక పొదుపు పథకాలను అందిస్తోంది. ఈ స్కీమ్స్ మంచి రిటర్న్స్ ఇస్తాయి కూడా. అలాంటి పథకాల్లో పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్ (Post Office Recurring Deposit Account) కూడా ఒకటి. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇందులో ప్రతీ నెలా కొంత మొత్తం పొదుపు చేయడం ద్వారా భారీగా రిటర్న్స్ పొందొచ్చు. రిస్క్ లేని పెట్టుబడి ఇది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తుంటాయి. కానీ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. రిస్క్ తీసుకోలేనివారు పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మరి మీకు రూ.16 లక్షల వరకు రిటర్న్స్ కావాలంటే ఎలా పొదుపు చేయాలి? ఎంత పొదుపు చేయాలి? తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్‌ను 18 ఏళ్లు దాటినవారు ఎవరైనా ఓపెన్ చేయొచ్చు. 10 ఏళ్లు దాటిన మైనర్లు కూడా ఈ అకౌంట్ తెరవొచ్చు. వారి తరఫున తల్లిదండ్రులు లేదా సంరక్షకులు అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. జాయింట్‌గా కూడా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఇందులో కనీసం రూ.100 నుంచి పొదుపు చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఈ స్కీమ్‌లో ప్రతీ నెలా రూ.10,000 చొప్పున 10 ఏళ్లపాటు జమ చేస్తే రూ.16 లక్షల రిటర్న్స్ లభిస్తాయి. చక్రవడ్డీ ప్రతీ ఏటా లెక్కిస్తారు. కాబట్టి మీరు జమ చేసిన మొత్తానికి వడ్డీతో పాటు చక్ర వడ్డీ లభిస్తుంది. ఇదే కాకుండా పోస్ట్ ఆఫీసులో అనేక అకౌంట్స్, సేవింగ్స్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్, నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ అకౌంట్, నేషనల్ సేవింగ్స్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అకౌంట్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ అకౌంట్ (SCSS), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSA), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC), కిసాన్ వికాస్ పత్ర (KVP) లాంటి స్కీమ్స్ కూడా ఉన్నాయి. వేర్వేరు పథకాలకు వేర్వేరు బెనిఫిట్స్ ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)