ముందుకు ప్రతీ ఒక్కరూ ఇష్టపడేది పోస్టాఫీసు పొదుపు ఖాతా. దీనిని కేవలం రూ.20 ఖర్చుతో ఈ ఖాతాను ఓపెన్ చేయవచ్చు. దీనిలో కనీసం నిల్వ అనేది రూ.500 ఉండాలి. దీనికి చెక్ బుక్స్, విత్ డ్రా ఆప్షన్లు ఉన్నాయి. దీని తర్వాత ఎక్కువగా పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ ను చాలా మంది ఇష్టపడతారు. దీనిలో కనీసం మినిమం బ్యాలెన్స్ గా రూ.10 ఉంటే సరిపోతుంది. ఖాతాను నగదు లేదా చెక్కు సాయంతో మొదలుపెట్టవచ్చు. ప్రస్తుతం ఈ తరహా ఖాతాలకు 6.9% వరకూ వడ్డీని అందిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
మరో పథకం పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ . దీనిలోకనీస కాలపరిమితి 5 ఏళ్లుగా ఉంటుంది. పోస్టాఫీసు ఆర్డీలో పొదుపు చేయగల సొమ్ముకు గరిష్ట పరిమితి లేదు. కొన్ని సంవత్సరాల వరకు పొదుపు చేసేందుకు పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ అనేది ఉపయోగపడుతుంది. దీనిలో కనీసం రూ.200 తో పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ ప్రారంభించవచ్చు. ఏడాది నుంచి మొదలుకొని రెండేళ్లు, మూడేళ్లు, 5 సంవత్సరాల డిపాజిట్లు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
60 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు గల వారికి సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అందుబాటులో ఉంది. ఈ పథకం మెచ్యూరిటీ పీరియడ్ 5 సంవత్సరాలు ఉంటుంది. రూ.1 లక్ష కంటే తక్కువ సొమ్ముతో ఎంతతోనైనా ఈ పథకాన్ని ప్రారంభించొచ్చు. ఈ పథకంలో పెట్టుబడిని ఒక తపాలా శాఖ నుంచి మరో శాఖకు మార్చుకోవచ్చు. త్రైమాసిక వడ్డీ లెక్కింపుతో ఏప్రిల్, జులై, అక్టోబర్, జనవరి నెలల్లో చెల్లింపు చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
జాతీయ పొదుపు పత్రాలు(ఎన్ఎస్సీ) లో 100 రూపాయల కనీస సొమ్ముతో ఈ రకమైన ఖాతా ప్రారంభించవచ్చు. రూ.100 మొత్తాల్లో పెట్టుబడి పెట్టగల ఈ పథకానికి గరిష్ట పరిమితంటూ లేదు. 7.6శాతంతో చక్రవడ్డీని వార్షికంగా లెక్కించి మెచ్యూరిటీ సమయంలో చెల్లిస్తారు. ఉద్యోగం చేస్తున్న సమయంలో ఈ పథకంలో పెట్టుబడి పెట్టొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకాలు. దీనిలో భాగంగా క్రమంగా ఆదాయం కావాలనుకునేవారికి ఈ పథకం ప్రయోజనకరం. ఈ పథకంలో ఒకరి పేరిట గరిష్టంగా రూ. 4.5 లక్షల వరకూ పెట్టుబడి పెట్టొచ్చు. వీటిల్లో పెట్టుబడి పెట్టిన వారికి ఐదేళ్ల వరకూ నెలవారీ వడ్డీ చెల్లింపు చేస్తారు. రూ.1500 మొత్తాల్లో పెట్టుబడి పెట్టే వీలుంటుంది. .(ప్రతీకాత్మక చిత్రం)
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్ ) పథకం బ్యాంక్ ఖాతా నుంచి కూడా తీసుకోవచ్చు. పోస్టాఫీసు విషయానికి వస్తే, ఇది సుమారు 7.1 శాతం వడ్డీని అందిస్తోంది. ఇది పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ కంటే ఎక్కువ వడ్డీని ఇస్తోంది. పిపిఎఫ్ తెరవడానికి ముందు కనీసం 15 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)