Grace Electric Scooter: రూ.100 పొదుపుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనండి.. ఒక్కసారి చార్జ్ చేస్తే 100 కి.మి వెళ్లొచ్చు!!
Grace Electric Scooter: రూ.100 పొదుపుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనండి.. ఒక్కసారి చార్జ్ చేస్తే 100 కి.మి వెళ్లొచ్చు!!
Poise Scooter | మీరు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్నారా? అయితే గుడ్ న్యూస్. ఎందుకంటే సూపర్ స్టైలిష్ లుక్‌తో ఒక స్కూటర్ అదరగొడుతోంది. దీన్ని మీరు రూ. 100 పొదుపుతో కొనొచ్చు.
Electric Scooter | కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు శుభవార్త. ఎందుకంటే మీకోసం అదిరిపోయే ఆప్షన్ ఒకటి అందుబాటులో ఉంది. స్టైలిష్ లుక్‌తో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ దుమ్మురేపుతోంది. ఇంకా ఇందులో అదిరే ఫీచర్లు ఉన్నాయి.
2/ 10
ఇంతకీ ఆ స్కూటర్ ఎంటని ఆలోచిస్తున్నారా? అదే పోయెస్ గ్రేస్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ స్కూటర్ లుక్ సూపర్‌గా ఉంది. చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఫ్రంట్ హెడ్ లైట్ డిఫరెటింగ్గా ఉంది. దీంతో స్కూటర్ లుక్ అదిరిపోయింది.
3/ 10
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 50 కిలోమీటర్లు. అలాగే ఒక్కసారి చార్జింగ్ పెడితే ఈ స్కూటర్ 80 నుంచి 100 కిలోమీటర్ల వరకు వెళ్తుందని కంపెనీ పేర్కొంటోంది. ఇందులో అలాగే 800 వాట్ బాష్ మోటార్ ఉంటుంది.
4/ 10
లిథియం రిమూవబుల్ బ్యాటరీలను ఇందులో అమర్చారు. అలాగే ఈ స్కూటర్లోని బ్యాటరీ, విడి భాగాలు, మోటార్ వంటి వాటిపై వారంటి కూడా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్లాక్, గ్రే, వైట్, బ్లూ రంగుల్లో కస్టమర్లకు అందుబాటులో ఉంది.
5/ 10
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉంది. గ్రేస్ ప్రో, గ్రేస్ ప్రీమియం అనేవి ఇవి. గ్రేస్ ప్రో రేంజ్ 80 కిలోమీటర్లు. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ. 97,174. గ్రేస్ ప్రీమియం ధర రూ. 1,07,788. దీని రేంజ్ 100 కిలోమీటర్లు.
6/ 10
ఈ స్కూటర్ కొనుగోలు చేయాలని భావించే వారు కంపెనీ వెబ్సైట్లోకి ప్రిబుకింగ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ స్కూటర్లు బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రానున్న కాలంలో దేశవ్యాప్తంగా ఈ స్కూటర్ అందబాటులోకి తెస్తామని కంపెనీ పేర్కొంటోంది.
7/ 10
గ్రేస్ ప్రో ఆన్‌రోడ్ ధర రూ. 1,03,274గా ఉంది. దీన్ని మీరు ఈఎంఐలో కొనొచ్చు. 36 నెలల ప్లాన్ ఎంచుకుంటే నెలవారీ ఈఎంఐ రూ. 3,300 వరకు పడుతుంది. అంటే మీరు రోజుకు దాదాపు రూ. 100 పొదుపు చేస్తే సరిపోతుంది. ఇక్కడ డౌన్ పేమెంట్ రూ. 25 వేలుగా పరిగణలోకి తీసుకున్నాం. గ్రేస్ ప్రో వేరియంట్‌కు ఇది వర్తిస్తుంది.
8/ 10
అదే మీరు గ్రేస్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటే మాత్రం రూ. 30 వేల డౌన్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే 36 నెలల ప్లాన్ ఎంచుకుంటే.. అప్పుడు నెలకు మీకు రూ. 3600 వరకు ఈఎంఐ పడుతుంది. అదే టెన్యూర్ తగ్గించుకుంటే ఈఎంఐ పెరుగుతుంది.
9/ 10
పోయేస్ కంపెనీ లోన్ ఫెసిలిటీ కోసం శ్రీ రామ్ ఫైనాన్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. స్కూటర్ కొనుగోలుపై సులభంగా లోన్ పొందొచ్చు.
10/ 10
లోన్ పొందాలని భావించే వారు ఆధార్ కార్డు, పాన్ కార్డు, అడ్రస్ ప్రూఫ్, మూడు నెలల బ్యాంక్ స్టేట్మెంట్, 3 ఫోటోలు, ఒక చెక్ వంటి డాక్యుమెంట్లును అందించాల్సి ఉంటుంది. మీ క్రెడిట్ ప్రొఫైల్ ఆధారంగా వడ్డీ రేటు, లోన్ అమౌంట్ మారతాయి.