1. ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (Punjab National Bank) మహిళల కోసం ప్రత్యేక సేవింగ్స్ అకౌంట్ (Savings Account) ఆఫర్ చేస్తోంది. పీఎన్బీ పవర్ సేవింగ్స్ అకౌంట్ (PNB Power Savings Account) పేరుతో ఈ అకౌంట్ అందుబాటులో ఉంది. కేవలం మహిళల కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూపొందించిన అకౌంట్ ఇది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఈ అకౌంట్‌తో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఉచితంగా 5 లక్షల వరకు ఇన్స్యూరెన్స్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. స్వీప్ ఫెసిలిటీ, ఉచితంగా డెబిట్ కార్డ్, లాకర్ రెంట్ ఛార్జీలపై తగ్గింపు, నెఫ్ట్ ఛార్జీలు, ఎస్ఎంఎస్ ఛార్జీలు లేకపోవడం లాంటి ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మరి ఈ అకౌంట్ ఎవరు తీసుకోవచ్చు? పూర్తి ప్రయోజనాలు ఏంటీ? తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఈ అకౌంట్ తీసుకున్నవారికి ఉచితంగా రూపే ప్లాటినం డెబిట్ కార్డ్ లభిస్తుంది. పీఎన్బీ పవర్ సేవింగ్స్ అకౌంట్ హోల్డర్లకు ఎస్ఎంఎస్ అలర్ట్ ఛార్జీలు, నెఫ్ట్ ఛార్జీలు ఉండవు. అకౌంట్ స్టేట్మెంట్, సిగ్నేచర్ అటెస్టేషన్, డూప్లికేట్ పాస్‌బుక్, ఇంట్రెస్ట్ సర్టిఫికెట్, బ్యాలెన్స్ సర్టిఫికెట్ కోసం ఛార్జీలు ఉండవు. (ప్రతీకాత్మక చిత్రం)
6. పీఎన్బీ పవర్ సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్ చిన్న లాకర్ తీసుకుంటే మొదటి ఏడాది ఛార్జీల్లో 25 శాతం తగ్గింపు లభిస్తుంది. ఈ అకౌంట్‌కు స్వీప్ సదుపాయం కూడా ఉంది. ఈ సదుపాయం ఎంచుకుంటే అకౌంట్లో ఎక్కువ మొత్తంలో డబ్బులు ఉంటే అందులో కొంత లిమిట్ తర్వాత మిగతా డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్లోకి ఆటోమెటిక్‌గా వెళ్తాయి. ఆ మొత్తానికి అధిక వడ్డీ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. క్వార్టర్లీ యావరేజ్ బ్యాలెన్స్ విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో రూ.500, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.1,000, మెట్రో నగరాల్లో రూ.2,000 చొప్పున ఉంటుంది. ఈ అకౌంట్ ఉన్నవారికి ప్రతీ ఏటా 50 పేజీల చెక్ బుక్ ఉచింగా లభిస్తుంది. పీఎన్బీ పవర్ సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్ ప్రతీ రోజు రూ.50,000 వరకు క్యాష్ విత్‌డ్రా చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)