1. దేశంలోని నిరాశ్రయులకు సొంతింటి కలను సాకారం చేయాలనే ఉద్దేశంతో ప్రారంభించిన పథకమే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY). 2022 నాటికి అల్ప ఆదాయ కుటుంబాలు, మధ్య ఆదాయ వర్గాలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వారి కోసం 2 కోట్ల గృహాలను నిర్మించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం (Central Govt) ప్రారంభించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. పథకం భారతదేశంలోని మహిళలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రాథమికంగా గిరిజనులు (Schedule Tribes), ఆదివాసీలు (Adivasis) వంటి నిర్లక్ష్యానికి గురవుతున్న సమూహాల కోసం ప్రధాన మంత్రి ఆవాస్ యోజనను ప్రారంభించారు. PMAY మార్గదర్శకాల (PMAY Guidelines) ప్రకారం, ఈ వర్గాలకు చెందిన వ్యక్తులు పట్టణ ప్రాంతాల్లో సరసమైన గృహాలను పొందుతారు. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఈ పథకంలో భాగంగా ప్రజలు హోమ్ లోన్ పొందవచ్చు. గృహ రుణాలపై భారత ప్రభుత్వం వడ్డీ రాయితీని అందిస్తుంది. హోమ్ లోన్‌పై సబ్సిడీ వడ్డీ రేటు సంవత్సరానికి 6.50% గా ఉంటుంది. లబ్ధిదారులందరికీ 20 సంవత్సరాల లోన్ గడువుకు ఈ వడ్డీ సబ్సిడీ ఆఫర్ వర్తిస్తుంది. PMAY CLSS సబ్సిడీ కింద రూ. 2.5 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4. PMAY ఇళ్ల కేటాయింపు సమయంలో.. గ్రౌండ్ ఫ్లోర్లను కేటాయించడంలో సీనియర్ సిటిజన్లు, వికలాంగులకు ప్రాధాన్యం ఇస్తారు. మహిళల పేరుతో ఇంటి నిర్మాణాన్ని ఈ పథకం ప్రోత్సహిస్తుంది. PMYA పథకం కింద ఇళ్ల నిర్మాణం కోసం సుస్థిరమైన, పర్యావరణ అనుకూల టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఆధునిక సాంకేతికతతో ఇళ్లను నిర్మిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, అల్ప ఆదాయ వర్గాల వారికి.. గరిష్టంగా రూ.6 లక్షల హోమ్ లోన్ మొత్తంపై వడ్డీరేటు ఆఫర్ వర్తిస్తుంది. 20 ఏళ్ల పాటు 6.5 శాతం వడ్డీ రేటు సబ్సిడీ ఉంటుంది. మధ్య ఆదాయ వర్గాలలోని MIG-1 విభాగం కిందకు వచ్చే వారికి.. గరిష్టంగా రూ.9 లక్షల హోమ్ లోన్ మొత్తంపై, 20 ఏళ్ల వరకు నాలుగు శాతం వడ్డీ రేటు సబ్సిడీ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)