PMSMY Pension Scheme: డబ్బున్న వారికి భవిష్యత్తు గురించి టెన్షన్ ఉండదు. డబ్బులేని సామాన్య, మధ్యతరగతి వారికి భవిష్యత్తు ఎప్పుడూ ప్రశ్నే. అందుకే ఫ్యూచర్ కోసం ఇప్పుడే ప్లాన్ వేసుకోవాలి. భవిష్యత్తులో ఏ పనీ చేయకపోయినా... నెల నెలా డబ్బు వచ్చే ప్లాన్ ఉండాలి. అందుకు ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన పెన్షన్ స్కీమ్ బాగా పనిచేస్తుంది. 40 ఏళ్ల లోపు వారు ఈ స్కీమ్‌లో చేరవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
వయసును బట్టీ... నెలకు ఎవరెరవరు ఎంత మొత్తం చెల్లించాలనేది నిర్ణయిస్తారు. అంటే... 18 ఏళ్ల వారు నెలకు రూ.55 చెల్లించాలి. అదే 29 ఏళ్లు ఉంటే... నెలకు రూ.100 చెల్లించాలి. అదే 40 ఏళ్లు ఉంటే... నెలకు రూ.200 చెల్లించాలి. వారికి 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.3,000 చొప్పున పెన్షన్ వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ స్కీమ్‌లో చేరాలంటే... మీకు దగ్గర్లోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)కి వెళ్లాలి. అది ఎక్కడుందో EPFO వెబ్సైట్లో వివరాలు ఉంటాయి. ఆ వెబ్ సైట్ https://www.epfindia.gov.in ఇదే. లేంటే... లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) బ్రాంచ్ ఆఫీసులో అప్లికేషన్ ఉంటుంది. దాన్ని ఫిలప్ చేసి కూడా ఇవ్వొచ్చు. అక్కడ కాకపోతే... స్టేట్ ఎంప్లాయిస్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC), EPFO, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లేబర్ ఆఫీసుల్లో కూడా అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)