1. భారతీయ రైల్వే మరో రెండు వందే భారత్ రైళ్లను ప్రారంభించనుంది. మహారాష్ట్రలో ఒకే రోజు రెండు వందే భారత్ రైళ్లకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) పచ్చ జెండా ఊపనున్నారు. ఫిబ్రవరి 10న ఈ కార్యక్రమం జరగనుంది. అదే రోజు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ప్రధాని పాల్గొననున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇప్పటివరకు 8 వందే భారత్ రైళ్లు ప్రారంభం అయ్యాయి. 9వ వందే భారత్ రైలును ముంబై నుంచి సోలాపూర్ రూట్లో ప్రారంభిస్తారు. దీంతో ముంబై, సోలాపూర్ మధ్య ప్రయాణ సమయం బాగా తగ్గనుంది. సోలాపూర్‌లోని సిద్ధేశ్వర్ వచ్చే ప్రజలు, అక్కల్కోట్, తుల్జాపూర్, పంఢరాపూర్, అలండి లాంటి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు వందే భారత్ రైలు సేవలు అందించనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఇక 10వ వందే భారత్ రైలు ముంబై-సాయినగర్ షిరిడీ రూట్లో అందుబాటులోకి రానుంది. నాసిక్, త్రయంబకేశ్వర్, సాయినగర్ షిరిడీ, శనిశిగ్నాపూర్ వెళ్లేవారికి ఈ రైలు సేవలు అందిస్తుంది. ఇప్పటికే మహారాష్ట్రలో రెండు వందే భారత్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మరో రెండు వందే భారత్ రైళ్లు ప్రారంభం కానున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ప్రస్తుతం 8 వందే భారత్ రైళ్లు పలు రూట్లలో తిరుగుతున్నాయి. న్యూఢిల్లీ- వారణాసి, న్యూఢిల్లీ- కాట్రా, గాంధీనగర్- ముంబై సెంట్రల్, న్యూఢిల్లీ- అంబ్ అందౌర, చెన్నై- మైసూరు, బిలాస్పూర్-నాగ్‌పూర్, హౌరా- న్యూ జల్పైగురి జంక్షన్, సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్లలో వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)