1. తెలుగు రాష్ట్రాలకు మరో వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు నడుస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా ప్రధాన మంత్రి మోదీ సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ట్రైన్ ప్రారంభించారు. ఈ రైలుకు ప్రయాణికుల నుంచి మంచి క్రేజ్ లభిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి రూట్లో వందే భారత్ రైలు ప్రారంభం కానుంది. ఈ రైలును కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని వార్తలు వస్తున్నాయి. నిత్యం తిరుపతి వెళ్లే శ్రీవారి భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు శ్రీవారి భక్తులతో పాటు తిరుపతి వెళ్లే ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు విజయవాడ మీదుగా వెళ్తుందని గతంలో వార్తలొచ్చాయి. అయితే తాజా వార్తల ప్రకారం సికింద్రాబాద్ నుంచి బీబీనగర్, గుంటూర్ మీదుగా తిరుపతికి వందే భారత్ రైలు ప్రయాణిస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ రైలు వరంగల్, ఖమ్మం, విజయవాడ మీదుగా ప్రయాణిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. దక్షిణ మధ్య రైల్వే నడపబోతున్న రెండో వందే భారత్ రైలును కూడా ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేశారు. ఈ రైలు గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. బీబీనగర్-గుంటూర్ సెక్షన్లో ఈ రైలు గరిష్టంగా 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది. వందే భారత్ రైలు నడిచేందుకు వీలుగా సికింద్రాబాద్-బీబీనగర్, గుంటూర్-గూడూరు సెక్షన్లను అప్గ్రేడ్ చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి పలు రూట్లలో పలు ఎక్స్ప్రెస్ రైళ్లు ఉన్నాయి. వీటిలో శబరి ఎక్స్ప్రెస్, నారాయణాద్రి ఎక్స్ప్రెస్ రైళ్లు గుంటూరు మీదుగా తిరుపతికి వెళ్తాయి. ఈ రూట్లో సికింద్రాబాద్ నుంచి తిరుపతి చేరుకోవడానికి 12 గంటల సమయం పడుతుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలులో 8 నుంచి 9 గంటల్లోనే సికింద్రాబాద్ నుంచి తిరుపతి చేరుకోవచ్చని అంచనా. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఇక సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు ఛార్జీలు ఎంత ఉంటాయన్న చర్చ కూడా జరుగుతోంది. సికింద్రాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి రూట్లలో దూరం దాదాపు ఒకేలా ఉంది. కాబట్టి ఛార్జీలు కూడా అంతే స్థాయిలో ఉంటాయని అంచనా వేస్తున్నారు. సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలులో ఏసీ చైర్ కార్లో రూ.1,600, ఎగ్జిక్యూటీవ్ ఛైర్ కార్లో రూ.3,100 ఛార్జీలు ఉండొచ్చని అంచనా. (ప్రతీకాత్మక చిత్రం)