వ్యాపారులను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించి, యువతకు నూతన ఉపాధి మార్గం కల్పించడమే లక్ష్యంగా మోదీ సర్కారు "ముద్ర లోన్" పథకాన్ని ముందుకు తెచ్చింది. దీని వల్ల యువత, మహిళలు, వ్యాపారులకు ఎంతో ప్రయోజనం కలుగనున్నది. ముద్ర లోన్ ద్వారా మీ వ్యాపారం కోసం ఏకంగా రూ .10 లక్షల వరకు రుణం పొందే వీలుంది. ప్రతీ జాతీయ బ్యాంకులోనూ ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం (పీఎంఎం వై) ద్వారా రుణాలను అందిస్తున్నారు. పీఎం ముద్ర యోజన పథకం ద్వారా చిరు వ్యాపారుల నుంచి ఎంఎస్ఎంఈ ఉత్పత్తి దారుల వరకూ 50 వేల నుంచి రూ. 10 లక్షల వరకు రుణం తీసుకునే అవకాశం ఉంది. ఇది వారి వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడంతో పాటు దానినే ఒక ఉపాధి మార్గంగా నిలుస్తోంది. వివిధ రంగాల్లో బిజినెస్ చేసుకునే వీధి వ్యాపారస్తులు, దుకాణదారుల, స్వయం సహాయక బృందాలకు ఇది బాగా ఉపయోగపడుతుంది.
ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం (పీఎంఎం వై)తో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పీఎం ముద్ర యోజన పథకం ద్వారా చిరు వ్యాపారులు రూ. 10 లక్షల వరకు రుణం తీసుకుని తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడంతో పాటు దానినే ఒక ఉపాధి మార్గంగాను మల్చుకోవచ్చు. వివిధ రంగాల్లో బిజినెస్ చేసుకునే వెండార్స్, వ్యాపారులు, దుకాణదారులకు ఇది బాగా ఉపయోగపడుతుంది. పీఎం ముద్ర యోజన పథకం కింద బ్యాంకులు మంజూరు చేసే ముద్ర రుణాలు మూడు రకాలుగా ఉంటాయి.
ముద్ర పథకం కింద 50 వేల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు రుణాలు లభిస్తాయి. అంటే 3 రకాల రుణాలు ఇస్తారు. శిశు, కిషోర్, తరుణ్ లోన్. శిశు లోన్లో రూ .50 వేల వరకు లోన్ లభిస్తుంది. కాగా, కిషోర్ రుణంలో రూ .50 వేల నుంచి 5 లక్షల వరకు, తరుణ్ లోన్ రూ .5 నుంచి 10 లక్షల వరకు రుణాలు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
దేశంలోని అన్ని ప్రభుత్వ బ్యాంకులకు ప్రభుత్వం అధికారం ఇచ్చింది. యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, డిసిబి బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, సింధు ఇంద్ బ్యాంక్, జమ్మూ & కాశ్మీర్ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్, కోటక్ మహీంద్రా, నైనిటాల్ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, ఐడిఎఫ్సీ బ్యాంక్ చేర్చబడ్డాయి. గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్ కంపెనీలు, ముద్ర రుణాలు తీసుకోవచ్చు.