Fact check | డబ్బుతో అవసరం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. చాలా మంది బ్యాంకుల నుంచి లోన్ తీసుకుంటూ ఉంటారు. ఆర్థిక కష్టాలను అధిగమించడానికి ఈ విధంగా రుణం వైపు మొగ్గు చూపుతారు. బ్యాంకులు సహా ఎన్బీఎఫ్సీలు, ఇతర ఫిన్ టెక్ కంపెనీలు సులభంగానే రుణాలు అందిస్తున్నాయి.
2/ 11
అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన స్కీమ్‌ను తెచ్చింది. ముద్రా యోజన కింద అర్హత కలిగిన వారికి సులభంగా రుణాలు అందేలా చూస్తోంది. కొత్తగా వ్యాపారం చేయాలని భావించినా లేదంటే ఉన్న వ్యాపారాన్ని విస్తరించాలన్నా మీరు ముద్ర స్కీమ్ ద్వారా లోన్ పొందొచ్చు.
3/ 11
అయితే ఇటీవల ఈ ముద్రా స్కీమ్‌కు సంబంధించిన ఒక అంశం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. రూ. లక్ష లోన్ పొందాలంటే రూ. 1750 చెల్లించాలనేది ఇందులోని మెసేజ్. ఈ లెటర్ సామాజిక మాధ్యమాల్లో తెగ షేర్ అయ్యింది.
4/ 11
అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. ఇది పూర్తిగా ఫేక్. కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఈ విషయాన్ని వెల్లడించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ముద్రా స్కీమ్ లోన్ లెటర్ పూర్తిగా ఫేక్ అని, అందులో నిజం లేదని తేల్చేసింది.
5/ 11
ముద్రా స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చార్జీలను వసూలు చేయలేదని ఫ్యాక్ట్ చెక్ పేర్కొంటోంది. లోన్ అగ్రిమెంట్ చార్జీలు రూ. 1750 అంటూ ఏమీ లేవని స్పష్టత ఇచ్చింది. ఆర్థిక శాఖ ఇలాంటి లెటర్స్‌ను జారీ చేయలేదని పేర్కంది. అందువల్ల మీరు ఇలిం విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
6/ 11
అందువల్ల మీకు కూడా ఇలాంటి మెసేజ్ ఏమైనా వస్తే.. దానితో జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి లింక్స్‌పై క్లిక్ చేయవద్దు. అలాగే మీ వివరాలను తెలియజేయవద్దు. లేదంటే మాత్రం అసలుకే ముప్పు వస్తుంది. బ్యాంక్ అకౌంట్ ఖాళీ కావొచ్చు.
7/ 11
కాగా కేంద్ర ప్రభుత్వం 2015లో ముద్రా స్కీమ్‌ను తీసుకువచ్చింది. ఇందులో భాగంగా నాన్ కార్పొరేట్, నాన్ అగ్రికల్చర్ వర్క్స్ కోసం సులభంగా లోన్ పొందొచ్చు. రూ. 10 లక్షల వరకు రుణం వస్తుంది. ఎలాంటి తనఖా పెట్టాల్సిన పని లేదు.
8/ 11
మూడు కేటగిరిల కింద లోన్స్ లభిస్తున్నాయి. శిశు కేటగిరి కింద రూ. 50 వేల వరకు రుణం వస్తుంది. అలాగే కిశోర్ కేటగిరి కింద రూ. 5 లక్షల వరకు లోన్ పొందొచ్చు. ఇక తరుణ్ కేటగిరి కింద రూ. 10 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు.
9/ 11
మీ అవసరాలకు అనుగుణంగా మీకు కావాల్సిన రుణ మొత్తం కోసం మీరు అప్లై చేసుకోవచ్చు. అర్హత కలిగిన వారికి సులభంగా రుణాలు లభిస్తాయి. క్రెడిట్ స్కోర్ బాగున్న వారికి సులభంగా లోన్ మంజూరు అయ్యే అవకాశం ఉంటుంది.
10/ 11
ఈ స్కీమ్ కింద తీసుకున్న రుణాన్ని 12 నెలల నుంచి ఐదేళ్ల కాలంలో తిరిగి చెల్లించొచ్చు. అంటే మీరు గరిష్టంగా ఐదేళ్ల వరకు ఈఎంఐ టెన్యూర్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఐదేళ్ల కాలంలో డబ్బులు కట్టలేకపోతే టెన్యూర్ మరింత పొడిగించుకోవచ్చు. ఉద్యమ్మిత్ర వెబ్‌సైట్‌కు వెళ్లి కూడా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.
11/ 11
ప్రభుత్వ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్, గ్రామీణ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, నాన్ ఫైనాన్షియల్ కంపెనీలు నుంచి మీరు ముద్రా స్కీమ్ కింద లోన్ పొందొచ్చు. అందువల్ల మీరు మీకు దగ్గరిలోని బ్యాంక్‌కు వెళ్లి ముద్రా స్కీమ్ గురించి వివరాలు తెలుసుకోవచ్చు.