PM Mudra Scheme | మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలని భావిస్తున్నారా? లేదంటే వ్యాపారాన్ని మరింత విస్తరించాలని చూస్తున్నారా? అయితే చేతిలో డబ్బులు లేవా? మీకు ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. కేంద్ర ప్రభుత్వం పీఎం ముద్రా స్కీమ్ అందిస్తోంది. ఈ పథకం కింద అర్హత కలిగిన వారికి రూ. 10 లక్షల వరకు రుణం లభిస్తుంది. ఎలాంటి తనఖా అవసరం లేదు. ఈ స్కీమ్ ద్వారా నాలుగు బెనిఫిట్స్ పొందొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముద్రా స్కీమ్‌లో చేరిన వారికి ముద్ర కార్డు అందిస్తారు. అందువల్ల మీరు ఈ కార్డు ద్వారా మీకు కావాల్సిన మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇలా మీరు ఉపయోగించుకున్న మొత్తంపైనే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ముద్రా కార్డు ద్వారా విత్‌డ్రా చేసుకున్న అమౌంట్ పైనే వడ్డీ పడుతుంది.