అయితే ఉచిత బియ్యం స్కీమ్‌ను పొడిగిస్తారా? లేదా? అనే అంశంపై కేంద్రం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభ కరండ్లాజే మాత్రం కీలక ప్రకటన చేశారు. డిసెంబర్ తర్వాత ఉచిత బియ్యం పథకాన్ని పొడిగించాలా? వద్దా? అనే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ ఒక నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం గత 28 నెలల్లో ఉచిత బియ్యం పంపిణీ కోసం ఏకంగా రూ. 1.8 లక్షల కోట్లు ఖర్చు చేసిందని ఆమె వెల్లడించారు. ఫుడ్ సెక్యూరిటీ చట్టం, ఇతర సంక్షేమ పథకాల కింద అందించేందుకు అవసరమైన ఆహారధాన్యాలను కేంద్రం కలిగి ఉందని, స్టాక్ సరిపడినంత ఉందని వివరించారు. ఆహార ధాన్యాల సేకరణ సజావుగానే కొనసాగుతోందని తెలిపారు.