రైతులకు అండగా ఉండాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పథకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 12
ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రతీ ఏడాది రూ. 6 వేలను వారి ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ డబ్బులను మూడు విడతల్లో రూ. 2 వేల చొప్పన జమ చేస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 12
ఇప్పటికే 8 విడతల్లో డబ్బులు జమ చేసిన కేంద్రంలోని మోదీ సర్కార్ తాజాగా 9విడత డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 12
ఈ 9వ విడత డబ్బులను ఆగస్టులో రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 12
అయితే అనేక మంది రైతులు ఈ పథకం గురించి అవగాహన లేక, సరైన సమయంలో దరఖాస్తు చేసుకోలేక నష్టపోతున్నారు. మరి కొందరు దరఖాస్తు సమయంలో పొరపాట్ల కారణంగా కూడా డబ్బులు పొందలేకపోతున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 12
కొత్తగా పీఎం కిసాన్ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న రైతులు ఈ స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 12
1. రైతులు మొదటగా pmkisan.gov.in వెబ్సైట్ ఓపెన్ చేయాలి. అందులో ఫార్మర్స్ కార్నర్ ఎంపికపై క్లిక్ చేయాల్సి ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 12
2. తర్వాత New Farmer Registration ఆప్ఫన్ పై క్లిక్ చేస్తే.. కొత్త టాబ్ తెరుచుకుంటుంది. ఇందులో ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్ నమోదు చేయాల్సి ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
9/ 12
3. అనంతరం మీ వివరాలు, భూమికి సంబంధించిన వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఫామ్ మొత్తం నింపిని తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.(ప్రతీకాత్మక చిత్రం)
10/ 12
గతంలో దరఖాస్తు చేసుకునే సమయంలో తప్పుగా వివరాలు నమోదు చేసి వారు https://www.pmkisan.gov.in/ వెబ్ సైట్ కి వెళ్లి కుడి వైపు కార్నల్ లో కనిపించే Edit Aadhar failure recordsపై క్లిక్ చేసి వివరాలను సరిచేసుకోవచ్చు.
11/ 12
దరఖాస్తు చేసే సమయంలో వ్యవసాయ భూమి పేపర్లు ఉండాలి. ఇంకా.. ఆధార్ కార్డు, అప్డేట్ చేసిన బ్యాంక్ ఖాతా వివరాలు, అడ్రస్ ప్రూఫ్, ఫీల్డ్ ఇన్ఫర్మేషన్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అవసరం ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
12/ 12
పీఎం కిసాన్ పథకానికి రైతులు దరఖాస్తు చేసే సమయంలో ఏమైనా సమస్యలు వస్తే హెల్ప్‌లైన్ నెంబర్లు 155261, 1800115526, 011-23381092కు రైతులు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)