కిసాన్ క్రెడిట్ కార్డు అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2020లో కొత్త కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్‌ను లాంచ్ చేసింది. దీని వల్ల రైతులకు సులభంగా రుణాలు లభిస్తున్నాయి. రైతులు అందరూ ఈ స్కీమ్ కింద బెనిఫిట్ పొందొచ్చు. ఈ పథకంలో చేరిన వారికి ఏటీఎం రూపే కార్డు అందిస్తున్నారు. క్రెడిట్ లిమిట్ లభిస్తుంది. దీన్ని వాడుకోవచ్చు. ఉపయోగించిన డబ్బులను మళ్లీ కట్టాలి. కమర్షియల్ బ్యాంకులు, ఆర్ఆర్బీలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు ఈ స్కీమ్‌ను అమలు చేస్తున్నాయి.
ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన పథకం కూడా ఉంది. 2016 నుంచే ఈ స్కీమ్ అమలులో ఉంది. ప్రతికూల పర్యావరణం కారణంగా పంట నష్టం సంభవిస్తే.. ఈ స్కీమ్ కింద రైతులకు నష్ట పరిహారం లభిస్తుంది. తక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ప్రీమియం మొత్తాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమంగా పంచుకుంటాయి. లోన్ తీసుకున్న రైతులు ఈ స్కీమ్‌లో కచ్చితంగా చేరాల్సి ఉంటుంది.
ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన స్కీమ్ కూడా ఉంది. ఇది పెన్షన్ పథకం అని చెప్పుకోవచ్చు. రైతులు ఇందులో చేరొచ్చు. 2019లో ఈ పథకం అమలులోకి వచ్చింది. 18 నుంచి 40 ఏళ్ల వయసులో ఉన్న రైతులు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. నెలకు రూ.55 నుంచి రూ. 200 వరకు చెల్లించాల్సి ఉంటుంది. వయసు, పెన్షన్ మొత్తం ప్రాతిపదికన మీరు చెల్లించాల్సిన నెలవారీ మొత్తం మారుతుంది. గరిష్టంగా రూ. 3 వేల వరకు పెన్షన్ పొందొచ్చు. 60 ఏళ్ల నుంచి పెన్షన్ వస్తుంది.
వడ్డీ రాయితీ స్కీమ్‌ను మళ్లీ తీసుకువచ్చారు. 2022 ఆగస్ట్ నెలలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ స్కీమ్ కింద వడ్డీ రేటులో 1.5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. రూ. 3 లక్షల వరకు రుణం తీసుకున్న రైతులకు ఈ బెనిఫిట్ ఉంటుంది. అలాగే కచ్చితంగా ప్రతి ఏటా రుణ మొత్తాన్ని చెల్లిస్తూ రావాలి. అంటే వడ్డీ కట్టి, మళ్లీ లోన్ రీషెడ్యూల్ చేసుకోవాలి.