పీఎం కిసాన్ పథకాన్ని చిన్న, సన్నకారు రైతులకు మేలు చేయాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చారు. కానీ చాలా మంది అనర్హులు కూడా లబ్ధి పొందుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ పన్ను కడుతున్న వారు, భారీగా ఆస్తులున్న వారు కూడా డబ్బులు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో వారందరి పేర్లను తొలగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)
ఆడిట్ అనంతరం.. అర్హులు, అనర్హుల వివరాలను గ్రామసభ ద్వారా వెల్లడిస్తారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి డాక్టర్ దేవేష్ చతుర్వేది గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లాల మేజిస్ట్రేట్లు, చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్లు, డిప్యూటీ అగ్రికల్చర్ డైరెక్టర్లకు పంపిన లేఖలు పంపించారు. (ప్రతీకాత్మక చిత్రం)
యూపీ నుంచి అధిక ఫిర్యాదులు రావడంతో.. మొదట ఆ రాష్ట్రంలో సోషల్ ఆడిట్ నిర్వహిస్తున్నారు. త్వరలో అన్ని రాష్ట్రాల్లో కూడా అనర్హులను గుర్తించి, వారిని లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించనున్నారు. ఇన్నాళ్ల అక్రమంగా డబ్బులు పొందిన వారంతా.. తిరిగి ఆ డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోనున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM KISAN)) పథకాన్ని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద చిన్న, సన్నకారు రైతులకు ప్రతి ఏటా రూ.6వేల ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ మొత్తాన్ని ఒకేసారి ఇవ్వకుండా విడతల వారీగా ఖాతాల్లో వేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)