1. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) పథకంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం మే 31న రైతుల అకౌంట్లలోకి రూ.2,000 చొప్పున జమ చేసింది. 10 కోట్లకు పైగా రైతులకు రూ.21,000 కోట్లు విడుదల చేసింది. పీఎం కిసాన్ స్కీమ్‌లోని 11వ ఇన్స్టాల్మెంట్ (PM Kisan 11th Installment) ఇది. అయితే ఇప్పటికీ చాలామంది రైతుల అకౌంట్లలో డబ్బులు జమ కాలేదు. (ప్రతీకాత్మక చిత్రం)
2. డబ్బులు రాని రైతులు పీఎం కిసాన్ డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. పీఎం కిసాన్ డబ్బులు పొందడానికి ఇకేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి అని అధికారిక వెబ్సైట్లో ఉంది. పీఎం కిసాన్ రైతులు ఇకేవైసీ పూర్తి చేసినా రైతుల అకౌంట్లలో డబ్బులు జమ కాలేదు. దీంతో ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఎలా కంప్లైంట్ చేయాలి? అని రైతుల్లో సందేహాలు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ https://pmkisan.gov.in/ ఓపెన్ చేయాలి. Farmers Corner సెక్షన్లో Beneficiary Status పైన క్లిక్ చేయాలి. రైతులు తమ ఆధార్ నెంబర్ వివరాలు ఎంటర్ చేసి Get Data పైన క్లిక్ చేయాలి. రైతుల అకౌంట్లో 11వ ఇన్స్టాల్మెంట్ జమ అయిందో లేదో తెలుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. రైతులు తమ అకౌంట్లోకి డబ్బులు జమ కాకపోతే ఫిర్యాదు చేయొచ్చు. ఇమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయాలనుకుంటే pmkisan-ict@gov.in లేదా pmkisan-funds@gov.in ఇమెయిల్ ఐడీల్లో కంప్లైంట్ చేయొచ్చు. లేదా 011-24300606, 155261 హెల్ప్‌లైన్ నెంబర్లకు కాల్ చేయొచ్చు. పీఎం కిసాన్ టోల్ ఫ్రీ నెంబర్ 1800-115-526 కి కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. పీఎం కిసాన్ రైతులకు డబ్బులు జమ కాకపోవడానికి పలు కారణాలు ఉంటాయి. పేరు మిస్‌మ్యాచ్ కారణంగా డబ్బులు జమ కాకపోవచ్చు. ఇందుకోసం పీఎం కిసాన్ పోర్టల్‌లో వివరాలు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సాంకేతిక కారణాల వల్ల డబ్బులు జమ కావడంలో ఆలస్యం జరగొచ్చు. లేదా ఇతర కారణాలు ఉంటే రైతులు ఫిర్యాదు చేయొచ్చు. ఒకసారి సమస్య పరిష్కారం అయిన తర్వాత పెండింగ్‌లో ఉన్న పేమెంట్స్ మొత్తం జమ అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. కేంద్ర ప్రభుత్వం 2019లో పీఎం కిసాన్ స్కీమ్‌ను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రైతుల అకౌంట్లోకి ప్రతీ ఏటా రూ.6,000 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. ప్రతీ ఏటా మూడు వాయిదాల్లో రూ.2,000 చొప్పున జమ చేస్తోంది. ఇప్పటివరకు 11 ఇన్స్టాల్మెంట్స్ జమ అయ్యాయి. 12వ ఇన్స్టాల్మెంట్ జూలై తర్వాత రిలీజ్ కానుంది. (ప్రతీకాత్మక చిత్రం)