1. ప్రస్తుతం రైతుల ఖాతాల్లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రూ.2,000 చొప్పున మూడు విడతల్లో మొత్తం రూ.6,000 జమ అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బుల్ని రెట్టింపు చేస్తుందన్న వార్తలొస్తున్నాయి. అదే జరిగితే రైతుల ఖాతాల్లోకి ప్రతీ విడతలో రూ.2,000 బదులు రూ.4,000 జమ అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. కేంద్ర ప్రభుత్వం ఈ ఒక్క నిర్ణయం తీసుకుంటే ప్రతీ ఏటా రైతుల ఖాతాలో రూ.12,000 పెట్టుబడి సాయం జమ అవుతుంది. కోట్లాది మంది రైతులకు మేలు చేయబోయే నిర్ణయం ఇది. కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయాన్ని రూ.6,000 నుంచి రూ.12,000 చేస్తుందని తాజాగా వస్తున్న వార్తల సారాంశం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. మరోవైపు రైతులు కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని రెట్టింపు చేయాలని ఎదురుచూస్తున్నారు. దీనిపై ప్రభుత్వ స్థాయిలో చర్చ జోరందుకున్నట్లు చెబుతున్నారు. ఇదే జరిగితే దేశంలోని 12 కోట్ల మంది రైతులకు మేలు జరుగుతుంది. మరోవైపు రైతు సంఘాలు కూడా పీఎం కిసాన్ డబ్బుల్ని పెంచాలని చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
6. గతేడాది ఏప్రిల్-జూలై విడతలో 11.27 కోట్ల రైతులకు, ఆగస్ట్-నవంబర్ విడతలో 8.99 కోట్ల రైతులకు, 2022 డిసెంబర్-2023 మార్చి విడతలో 8.53 కోట్ల రైతులకు పీఎం కిసాన్ డబ్బులు జమ అయ్యాయి. రైతులు తమ వివరాలు సరిగ్గా అప్డేట్ చేయకపోవడం వల్లే పీఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య తగ్గుతుందని భావిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)