కొత్త సంవత్సరం సందర్భంగా దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది రైతులకు మోదీ ప్రభుత్వం భారీ కానుకను అందించనుంది. ప్రధానమంత్రి జనవరి 1, 2022నమధ్యాహ్నం 12 గంటలకు PM కిసాన్ యోజన 10వ విడత నగదును బదిలీ చేస్తారు. ఇప్పటివరకు దేశంలోని 11.37 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాలకు రూ.1.58 లక్షల కోట్లకు పైగా ప్రభుత్వం నేరుగా (డీబీటీ) బదిలీ చేసింది.(ప్రతీకాత్మక చిత్రం )
పీఎం కిసాన్ 10వ ఇన్స్టాల్మెంట్, పీఎం కిసాన్ ఇన్స్టాల్మెంట్, పీఎం కిసాన్ పథకం, పీఎం కిసాన్ స్కీమ్, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన" width="1200" height="800" /> మీరు PM కిసాన్ స్కీమ్ కోసం నమోదు చేసుకున్నట్లయితే, ఈ పథకం యొక్క లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడం ముఖ్యంజ జాబితాలో మీ పేరును ఇలా తనిఖీ చేయండి. ముందుగా మీరు PM కిసాన్ యోజన అధికారిక వెబ్సైట్ https://pmkisan.gov.inని సందర్శించాలి.(ప్రతీకాత్మక చిత్రం )
క్రెడిట్ కార్డ్ ఆన్లైన్ అప్లికేషన్, కిసాన్ క్రెడిట్ కార్డ్ ఎలా అప్లై చేయాలి, కిసాన్ క్రెడిట్ కార్డ్ ఎలా తీసుకోవాలి, మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డ్" width="1200" height="800" /> ఇప్పటి వరకు 9వ విడత లబ్ధి పొందని రైతులకు రెండు విడతల సొమ్ము వారి ఖాతాల్లోకి చేరుతుంది. అంటే వారి ఖాతాలో 4000 రూపాయలు బదిలీ అవుతాయి. అయితే ఈ సదుపాయం సెప్టెంబర్ 30 లోపు నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం )