PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. అతి తక్కువ వడ్డీకే రూ. 3 లక్షల వరకు లోన్.. దరఖాస్తు చేయండిలా..
PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. అతి తక్కువ వడ్డీకే రూ. 3 లక్షల వరకు లోన్.. దరఖాస్తు చేయండిలా..
PM Kisan: రైతులకు పంట పెట్టుబడి కింద పీఎం కిసాన్ నుంచి కేంద్రం రూ.6వేలు సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే పీఎం కిసాన్ లబ్దిదారులకు కిసాన్ క్రెడిట్ కార్డుల(KCC) ద్వారా అతి తక్కువ వడ్డీకే రుణాలను పొందొచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వ పథకాల్లో రైతులకు ఉపయోగపడే పథకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి. దీని ద్వారా రైతులకు వ్యవసాయ పెట్టుబడి కోసం సంవత్సరానికి మూడు విడతల్లో రూ.6 వేలు సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే పీఎం కిసాన్ లబ్ధిదారులకు పీఎం కిసాన్ క్రెడిట్ కార్డులను కూడా సులభంగా పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
భారతదేశంలోని రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్కీమ్ పీఎం కిసాన్ క్రెడిట్ కార్డు. ఈ స్కీమ్ ద్వారా రైతులు తక్కువ వడ్డీకే లోన్ తీసుకోవచ్చు. దీని వల్ల మార్కెట్లో ఎక్కువ వడ్డీకే అప్పులు చేయాల్సిన అవరం లేదు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
అంతేకాదు... ఎలాంటి ష్యూరిటీ లేకుండా గరిష్టంగా రూ.3 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. కాంప్లిమెంటరీ ఇన్స్యూరెన్స్ కవరేజీ కూడా లభిస్తుంది. వడ్డీ రేటు 9 శాతంగా ఉంటుంది. అయితే ఇందులో సబ్సిడీ రూపంలో తగ్గింపు పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
కేంద్ర ప్రభుత్వం 2 శాతం రాయితీ అందిస్తుంది. దీంతో వడ్డీ రేటు 7 శాతానికి దిగివస్తుంది. రైతు సమయానికి ఎప్పటికప్పుడు లోన్ చెల్లిస్తే మరో 3 శాతం బ్యాంక్ తగ్గింపును ఇస్తుంది. దీంతో వడ్డీ 4 శాతానికి వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
ఇప్పటికి కేసీసీ కార్డు ఉంటే బ్యాంక్ కు వెళ్లి లోన్ కు దరఖాస్తు చేయవచ్చు. లేని వారు.. స్థానికంగా ఉండే ఏదైనా బ్యాంకుకు వెళ్లి కిసాన్ క్రెడిట్ కార్డు సెక్షన్లో ఉండే సిబ్బందిని సంప్రదించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
దరఖాస్తు ఫామ్ తీసుకొని, అవసరమైన డాక్యుమెంట్స్ జతచేసి సబ్మిట్ చేయాలి. లోన్ అధికారులు దరఖాస్తును పరిశీలించి కిసాన్ క్రెడిట్ కార్డును జారీ చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
ఈ మొత్తం ప్రాసెస్‌లో బ్యాంకు సిబ్బంది సహకారం తీసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ఐడీ కార్డ్, యూఐడీఏఐ జారీ చేసిన లెటర్స్ ఉంటే కేసీసీ కార్డును జారీ చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)